Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

డెబిట్ క్రెడిట్ వ్యవహారాల్లో ‘ఈమెయిల్’ తో జాగ్రత్త‌

, డెబిట్ క్రెడిట్ వ్యవహారాల్లో ‘ఈమెయిల్’ తో జాగ్రత్త‌

ఆధునిక పరిజ్ఞానంతో ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, లోన్ ద్వారా పొందిన డబ్బు, పెన్షన్ ఇలా ఏదైనా కావొచ్చు… బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఒక్క ఓటీపీతో అంతా మాయం చేస్తున్నారు. ఒకప్పుడు జేబు దొంగలు ఉండే స్థానంలో ఇప్పుడు ఓటీపీ దొంగలు వచ్చేశారు. ఫోన్ నంబర్లు, ఈమెయిళ్ల ద్వారా ఓటీపీ పొంది అకౌంట్ నుంచి డబ్బులు దోచేస్తున్నారు.

ఖాతాదారుడి ఈమెయిల్.. అతని ప్రమేయం లేకుండా మార్చేసి.. ఎంచక్కా అకౌంట్ ఖాళీ చేసేస్తున్న మోసం ఒకటి తాజాగా బయటపడింది. ఇలాంటి మోసాలకు బ్యాంకు పాత, ప్రస్తుత సిబ్బందిలో కొంతమంది సహకరిస్తున్నారని సమాచారం. ఓటీపీ నంబర్ రిజిస్టర్ ఈమెయిల్, ఫోన్ నంబర్లకు వస్తుంది. అలా వచ్చే ఓటీపీని మెయిల్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. తద్వారా అకౌంట్ ఖాళీ చేయొచ్చు.

ఇలాంటి మోసాలకు చెక్ పెట్టాలంటే.. ప్రతి ఆరునెలలకొకసారి ఈమెయిల్, ఫోన్ నంబర్లను మార్చుకోవాలంటున్నారు సైబర్ నిపుణులు. అంతేగాక గూగుల్ పే, పేటీయం, అమెజాన్ లాంటి యాప్‌లపను ఉపయోగించిన తర్వాత సైన్ అవుట్/లాగ్ అవుట్ చేయడం మర్చిపోవద్దంటున్నారు. అంతర్జాతీయ ప్రయాణీకులు మినహా మిగిలినవాళ్లు బ్యాంకులు అందిస్తున్న ఇంటర్నేషనల్ డెబిట్/క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు మోసాలకు సంబంధించి ఫిర్యాదుల విషయాలను ఆలస్యం చేయకుండా బ్యాంకులకు, అంబుడ్స్‌మెన్ దృష్టికి వెంటనే తీసుకు వెళ్లాలని చెబుతున్నారు.