అమెరికా పారిపోతుండగా మరోమారు పట్టుబడ్డ శివాజీ..!

Immegration Officers Arrests Sivaji in Dubai Airport over While He Escaping to America, అమెరికా పారిపోతుండగా మరోమారు పట్టుబడ్డ శివాజీ..!

నటుడు శివాజీ.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో దోరికిపోయాడు. అమెరికాకు పారిపోతూ ఇమిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. అలందా మీడియాకు సంబంధించిన కేసులో లుక్‌ అవుట్ నోటీసు ఉండటంతో.. ఆయన్ను దుబాయ్‌లో పట్టుకున్న అధికారులు.. హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ అమెరికా పారిపోతూ హైదరాబాద్‌లో దొరికిపోయాడు శివాజీ. అలందా మీడియా కేసులో విచారణకు రమ్మాన్నా.. ఆయన హాజరకాకపోవడంతో.. లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు.

అలందా మీడియా కేసులో సినీనటుడు శివాజీ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. టీవీ9 వాటాల కొనుగోలు వ్యవహారంలో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఉండటంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళుతూ శివాజీ పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు ఆయన మరోసారి ప్రయత్నించడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు శివాజీని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *