రూ.20 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లుః జీహెచ్‌ఎంసీ

GHMC Spents 20 Crore for Ganesh immersion, రూ.20 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లుః జీహెచ్‌ఎంసీ

గణేష్‌ నవరాత్రులు, ఉత్సవాలు ఒక ఎత్తైతే..భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనోత్సవం మరో ఎత్తు…తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్నగణనాధులు గంగమ్మ ఒడికి చేరే అద్భుత ఘట్టం..నగరంలోని బాలాపూర్‌ గణపతి లడ్డూ వేలం..ఖైరతాబాద్‌ భారీ వినాయకుడి నిమజ్జనం అత్యంత ప్రతిష్టాత్మకం. అత్యంత శోభాయమానంగా జరగనున్న గణేష్ నిమజ్జనానికి
జీహెచ్ఎంసి భారీ ఏర్పాటు చేసింది. ఇరవై కోట్ల రూపాయలతో ఏర్పాట్లను పూర్తి చేసింది. శోభాయాత్ర మార్గంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక యాక్షన్ టీంలను, నిమజ్జన ప్రాంతాలలో 27 వైద్య శిబిరాలు, 92 మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేశారు. 32 ప్రాంతాలలో 93 క్రేన్లు, 134 మొబైల్ క్రేన్లు, 32 కొలనులలో శుభ్రమైన నీటిని నింపడం, అన్ని చెరువుల వద్ద గజఈతగాళ్ల నియామకం, 36674 తాత్కాలిక టాయిలెట్లు, రోడ్లు భవనాల ద్వారా 12 కిమీ బారికేడ్లు, ఎలక్ట్రిక్ విభాగం నుండి 75 జనరేటర్లు, హుస్సేన్ సాగర్ లో వ్యర్ధాల తొలగింపుకు వెయ్యిమంది, 115 వాటర్ క్యాంపులు, 36 ఫైర్ ఇంజన్లు, సరూర్ నగర్, ప్రగతి నగర్, కాప్రా చెరువుల వద్ద మూడు బొట్లు, కేంద్ర విపత్తుల దళాలు, హుస్సేన్ సాగర్లో ఏడు బొట్లు, పదిమంది గజఈతగాళ్ళు, హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, నిరంతరం విద్యుత్ సరఫరాకు 101 అదనపు ట్రాన్స్ ఫార్మర్లు, ప్రతి సర్కిల్ లో ఒక హార్టికల్చర్ టీంలను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *