ఆ 36 ఏళ్ళ రికార్డును బద్దలకొట్టిన పాక్ క్రికెటర్.!

భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 36 ఏళ్ళ క్రితం నమోదు చేసిన రికార్డు‌ను పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ చెరిపేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అత్యంత పిన్న వయసులో 150+ స్కోరు సాధించిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. 1983 ప్రపంచకప్‌లో ట్రన్ట్‌బ్రిడ్జ్‌ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్‌‌దేవ్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటికి అతడి వయసు 24 ఏళ్లు. ఇక ఇప్పుడు 23 ఏళ్ల ఇమామ్‌ దాదాపు 36 ఏళ్ళ ఆ రికార్డు‌ను బద్దల కొట్టాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇమామ్‌ 131 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అందులో 16 బౌండరీలు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన ఇమామ్‌తో పాటు సొహైల్‌ (41), అసిఫ్ అలీ (52) రాణించడంతో ఇంగ్లాండ్‌కు పాక్‌ 359 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే పాక్‌ ఆశలను నీరు గారుస్తూ జానీ బెయిర్‌స్టో (128; 93 బంతుల్లో 15×4, 5×6), జేసన్‌ రాయ్‌ (76; 55 బంతుల్లో 8×4, 4×6)లు విధ్వంసం సృష్టించారు. దీనితో ఇంగ్లాండ్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇది ఇలా ఉంటే రెండేళ్లుగా ఇంగ్లాండ్‌ వన్డే క్రికెట్‌లో భీకర ఫామ్‌తో ఉంది. ఈసారి ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *