డాక్టర్ సుధాకర్​ ఘటనపై సీఎంకు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ లేఖ..‌

విశాఖలో డాక్టర్ సుధాకర్​ వ్యవహారంపై సీఎం జ‌గ‌న్ కు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ లేఖ రాసింది. పోలీసులు డాక్ట‌ర్ ప‌ట్ల‌ అమానుషంగా ప్రవర్తించారని ఐఎంఏ ముఖ్యమంత్రికి వివ‌రించింది. సీఎం పట్ల డాక్ట‌ర్ చేసిన కామెంట్స్ కూడా సమర్థనీయం కాదని తెలిపింది. ఓ డాక్ట‌ర్ పట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం దేశ‌వ్యాప్తంగా ఉన్న వైద్యులను మనోవేదనకు గురి చేస్తోందని లేఖలో పేర్కొంది. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ఆంధ్రప్రదేశ్ విభాగం సుధాకర్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్షిస్తున్నార‌ని.. ఐఎంఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ […]

డాక్టర్ సుధాకర్​ ఘటనపై సీఎంకు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ లేఖ..‌
Follow us

|

Updated on: May 20, 2020 | 11:01 AM

విశాఖలో డాక్టర్ సుధాకర్​ వ్యవహారంపై సీఎం జ‌గ‌న్ కు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ లేఖ రాసింది. పోలీసులు డాక్ట‌ర్ ప‌ట్ల‌ అమానుషంగా ప్రవర్తించారని ఐఎంఏ ముఖ్యమంత్రికి వివ‌రించింది. సీఎం పట్ల డాక్ట‌ర్ చేసిన కామెంట్స్ కూడా సమర్థనీయం కాదని తెలిపింది. ఓ డాక్ట‌ర్ పట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం దేశ‌వ్యాప్తంగా ఉన్న వైద్యులను మనోవేదనకు గురి చేస్తోందని లేఖలో పేర్కొంది.

ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ఆంధ్రప్రదేశ్ విభాగం సుధాకర్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్షిస్తున్నార‌ని.. ఐఎంఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ ప్రాథమిక నివేదికను కూడా సీఎంకు పంపింద‌ని వివ‌రించింది. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర, న్యాయ విచార‌ణ‌ జరుగుతుందని ఆశిస్తున్నామని.. పోలీసులపైనా తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు సీఎంకు రాసిన లేఖలో ఐఎంఏ వెల్ల‌డించింది.