Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

రిజర్వ్‌ ఫారెస్టులో అక్రమ ఇసుక ద‍ందా

, రిజర్వ్‌ ఫారెస్టులో అక్రమ ఇసుక ద‍ందా

అక్రమార్కులు అడవుల్లోకి అడుగుపెట్టాలంటే హడలిపోవాలి. వాళ్ల భరతం పట్టేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా’ అంటూ సాక్షా త్తూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చినా పరిస్థితి మారడం లేదు. ‘డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం’ అంటూ బోర్డులు తగిలించుకొని మరీ అక్రమార్కులు టిప్పర్లలో ఇసుకను దర్జాగా తరలించుకుపోతున్నారు. నిర్మల్‌ జిల్లాలోని రక్షిత అటవీ ప్రాంతాల్లో అక్రమ ఇసుక ద‍ందా భారీ ఎత్తున జరుగుతోంది.

అటవీ సంపద అంటే అడవులొక్కటే కాకుండా ఖనిజ వనరులైన ఇసుక, మాంగనీసు, సున్నపు రాయి వంటివి కూడా ఆ పరిధిలోకి వస్తాయి. చట్టం ప్రకారం అడవుల్లో తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవు. అయినా ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. పెంబి మండలం శెట్‌పల్లి, పరిసర గ్రామాల్లో ఈ తరహా వ్యవహారాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా వందలోపే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారు. కానీ వాటి పేరుతో వేలాది టిప్పర్లలో ఇసుకను తరలించారు. అటవీశాఖ ఈ వ్యవహారాలను అడ్డుకోవడంపై ఇప్పటికైనా దృష్టిసారించాలి.

నిర్మల్‌ జిల్లాలో ప్రధాన వాగులన్నీ అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్నాయి. కడెం వాగు అంతా రిజర్వ్‌ ఫారెస్ట్‌ మీదుగానే పారుతుంది.అలాగే ఖానాపూర్‌ నియోజకవర్గంలోని పలికేరు వాగు, రాజురా వాగులు కూడా అటవీ ప్రాంతాల మీదుగానే పారుతాయి. ఈ వాగుల్లో ఇసుక లభ్యత భారీగా ఉంటుంది. దీంతో సహజంగానే ఇసుకాసురుల కన్ను వీటిపై పడింది. నిర్మానుష్య ప్రాంతాలను ఆనుకొని ఉండే వాగుల వద్ద భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు పోగుచేసిన ఇసుకను నిర్మల్‌లోని ఓ రెడీమిక్స్‌ కాంక్రీ ట్‌ ప్లాంట్‌తో పాటు పలు కాంట్రాక్టు సంస్థలకు అమ్ముతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.