Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

మళ్లీ తిరిగివస్తా.. యూపీ పోలీసుల తీరుపై మండిపడ్డ ప్రియాంకా

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. సోన్‌భద్ర కాల్పుల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను అ్డడుకోవడం అప్రజాస్వామికమన్నారు. మీర్జాపూర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడం నేరామా అని ప్రశ్నించారు. భూ వివాదంలో అన్యాయంగా పది మంది గిరిజనులను చంపేశారని.. బాధితులను పరామర్శించడం తన బాధ్యత అని ప్రియాంకా అన్నారు. యూపీలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. అయితే ఇవాళ ఉదయం చునార్‌ అతిథి గృహం వద్దకు తరలివచ్చిన బాధిత కుటుంబాలను ప్రియాంక పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ బాధితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని వారిని ఓదార్చారు. చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితులను పరామర్శించాలన్న తన లక్ష్యం నెరవేరిందన్నారు.

మరోవైపు ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకోవడం గానీ, అరెస్టు గానీ చేయలేదన్నారు మీర్జాపూర్ డీఎం. ఇప్పుడు ఆమె ఎక్కడికైనా వెళ్లొచ్చని తెలిపారు. డీఎం వ్యాఖ్యలపై ప్రియాంకా ఘాటుగా స్పందించింది. నిన్నటి నుంచి నన్ను అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు అరెస్టు చేయలేదంటున్నారని.. ఎక్కడికైనా వెళ్లొచ్చంటున్నారన్నారు. వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానని.. బాధితుల్ని పరామర్శించిన నేను ఇప్పడు వెళ్తున్నాని…. కానీ మళ్లీ తిరిగి వస్తానన్నారు.