ఇల్లీ బేబి కసరత్తులు.. మెగాస్టార్ కోసమేనా..!

Ileana to romance Chiranjeevi in Koratala film?, ఇల్లీ బేబి కసరత్తులు.. మెగాస్టార్ కోసమేనా..!

ఇన్ని రోజులు విదేశీయుడితో ప్రేమలో ఉన్న గోవా బ్యూటీ ఇలియానా.. ఇటీవలే అతడితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. దీంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటోంది. దీంతో కసరత్తులు ప్రారంభించేసింది. ప్రతిరోజు జిమ్‌లో వ్యాయామం చేస్తోంది. అయితే ఈ కసరత్తుల వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఈ భామకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చిందట.

చిరు హీరోగా కొరటాల శివ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో చిరు సరసన హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. కాజల్, అనుష్క, శృతీ హాసన్, ఐశ్వర్య, నయనతార ఇలా పలువురిని చిరు కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎవరూ ఇంకా ఫైనల్ అయినట్లు అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా పేరు ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

చిరు మూవీ కోసం ఈ భామను సంప్రదించారని.. కథ నచ్చి ఇందులో నటించేందుకు ఇలియానా ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే సన్నబడేందుకు కసరత్తులు చేస్తోందని టాక్. మరి ఇందులో నిజమెంతా..? ఇల్లీ బేబి నిజంగానే మెగా ఆఫర్ కొట్టేసిందా..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న చిరు 152వ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందుకోసం చిరు కూడా సన్నబడే పనిలో ఉన్నారు. రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *