Breaking News
  • టీవీ9 తో DME డా. రమేష్ రెడ్డి. ప్లాస్మా అనేది సంజీవని కాదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే ప్రకటించింది. ప్లాస్మా ట్రీట్ మెంట్ పై ఐసీఎంఆర్ ఇప్పటివరకు ఫైనల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయలేదు. కొన్ని ప్రోటోకాల్స్ మాత్రమే ఇచ్చారు. గాంధీ లో 14 కేసులకు ప్లాస్మా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాము.. మంచి రిజల్ట్ వచ్చింది. ప్లాస్మా అనేది అవుట్స్టాండింగ్ ట్రీట్మెంట్లో include చేయాలా లేదా అనేది ఐ సి ఎం ఆర్ ఇంకా నిర్ధారించలేదు. ప్లాస్మా డోనర్స్ ముందుకు రావడం మంచి పరిణామం.
  • అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో మార్పులు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి చిన‌వీర‌భ‌ద్రుడుని త‌ప్పించిన ప్ర‌భుత్వం. పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ గా చిన‌వీర‌భ‌ద్రుడు నియామ‌కం,ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్న చిన‌వీర‌భ‌ద్రుడు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ గా కె,వెట్రిసెల్వి నియామకం. ఇంగ్లీష్ మీడియం అమ‌లు ప్రాజెక్ట్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా వెట్రిసెల్వికి పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు.
  • ఏపీలో నూతన ఇండస్ట్రియల్ పాలసీ కి శ్రీకారం. ఇప్పటికే నూతన ఇండస్ట్రియల్ పాలసీ ని ఖరారు చేసిన సర్కార్ . సోమవారం పాలసీని లాంచ్ చేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
  • ఈ ఏడాది సామూహిక నిమజ్జనం ఉండదు. దశల వారీ నిమజ్జనం. ప్రభుత్వానికి సహకరించాలి... కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎత్తు విషయంలో పోటీలకు పోకుండా.. చిన్న మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. -- భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.
  • కడపజిల్లాలో విషాదం. కమలాపురం మండలం యార్రగుడిపాడు గ్రామంలో అక్కచెల్లెళ్ల ఆత్మహత్యల్లో కొత్త కోణం. ముందురోజు ప్రొద్దుటూరులో తండ్రి బాబురెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. చనిపోయేముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన బాబు రెడ్డి. తన చావుకు అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పిన బాబు రెడ్డి. అల్లుడు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ..తనకి న్యాయమూర్తి న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో. తన తండ్రి చావుకు కారణం తన భర్తేనని తెలిసి రైలుకింద పది కుమార్తె స్వేతా రెడ్డి ఆత్మహత్య. అక్క చనిపోయిందని చెల్లెలు ఇంజినీరింగ్ విద్యార్థిని సాయి ఆత్మహత్య. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.
  • మొదలైన హీరో రానా దగ్గుబాటి మిహీక ల వివాహం. వేద మంత్రోచ్ఛారణ మధ్య 8.45 నిమిషాలకు వధువు మిహిక మెడలో తాళి కట్టనున్న వరుడు రానా. రామానాయుడు స్టూడియోలో వివాహ వేడుక . కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. స్టూడియోలో ప్రవేశించడానికి మై గేట్ యాప్ ద్వారా అనుమతి. వివాహ వేడుకలో 30మంది కి మించని కుటుంబ సభ్యులు మరియు నాగచైతన్య, సమంత.

పబ్‌జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలు చేసిన వైనం!

IIT Student Killed His Father Because Of Pubg, పబ్‌జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలు చేసిన వైనం!

స్మార్ట్‌ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌కు ఈకాలం యువత బానిసలు అవుతున్నారు. ఒకవేళ వారిని ఆట నుంచి దూరం చేస్తే ఉన్మాదులుగా మారి హత్యలు చేసేవరకు వెళ్ళుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒక కర్ణాటకలో జరిగింది. పబ్‌జీ గేమ్ ఆడుతుంటే అడ్డుకున్నారని కన్నతండ్రినే కత్తిపీటతో ముక్కలుగా నరికి హతమార్చాడు. ఈ ఘోరం కర్ణాటకలో బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో సోమవారం జరిగింది. హతుడు శంకరప్ప కమ్మార(60) కాగా, నిందితుడు అతని కుమారుడు రఘువీర్‌ కమ్మార (25). ఐటీఐ మెకానికల్‌ రెండో ఏడాది చదువుతున్న రఘువీర్‌ మొబైల్‌లో హింసను ప్రేరేపించే గేమ్స్‌కి బాగా అలవాటు పడ్డాడు. ఇక దానితో విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇక ఆ పిచ్చి బాగా ముదిరిపోయి శనివారం అర్ధరాత్రి రఘవీర్ అటు ఇంట్లోనూ, వీధిలో ఇతరుల ఇంటికి వెళ్లి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని వికృత చేష్టలు చేయడంతో స్థానికులు పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదుతో ఆదివారం తల్లిదండ్రులతో పాటు అతన్ని పోలీసులు పిలిపించి హెచ్చరించారు.

ఆదివారం అర్ధరాత్రి దాటేవరకు రఘువీర్ మొబైల్‌లో పబ్‌జీ ఆడుతుండగా.. అతని చేతికి రక్తం కారడం గమనించిన తల్లి ..చేతికి కట్టు కట్టబోయింది. దీంతో రఘువీర్.. ఆడుతుండగా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్ అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇదంతా గమనిస్తున్న తండ్రి రఘువీర్ చేతిని గట్టిగా పట్టుకుని కట్టు కట్టమని భార్యకు చెప్పగా.. అతడిలోని ఉన్మాది నిద్ర లేచాడు. తల్లిని మరో గదిలోకి నెట్టి గడియపెట్టి తన చేతికి ఉన్న బ్యాండేజ్‌ మొత్తం విప్పి తండ్రి గొంతుకు చుట్టి హత్య చేయబోయాడు, పక్కనే ఉన్న కత్తిపీట తీసుకుని తండ్రిపైన దాడి చేయగా.. అతడు ప్రాణాలు విడిచాడు. ఈ ఉన్మాది అంతటితో ఆగకుండా తండ్రి మొండాన్ని, తలను వేర్వేరుగా నరికేశాడు. రఘువీర్ ఇంట్లో నుంచి వస్తున్న అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోనికి వచ్చే ప్రయత్నం చేయగా వారిపై కూడా కత్తిపీటతో దాడికి యత్నించాడు. సుమారు అరగంట పాటు అలా ముప్పతిప్పలు పెట్టాడు. పోలీసులు ఒక బెడ్‌షీటు తీసి అతని పైన వేసి గట్టిగా పట్టుకొని బంధించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఆన్లైన్‌ గేమ్స్‌తో ఉన్మాద ఛాయలు…

ఆన్లైన్ ద్వారా ఈ కాలం యువత మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న ఎన్నో గేమ్స్ వారిలోని పైశాచికత్వాన్ని నిద్ర లేపుతున్నాయి. ఓన్లీ ఫర్ ఎంజాయ్‌మెంట్ అని వాటిని రూపొందించే నిర్వాహకులు అంటున్నా.. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వల్ల యువత వ్యసనాలకు లోబడి తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక పబ్‌జీ విషయానికి వస్తే.. ఈ ఆటకు యువత బానిస అయిపోయారు. చూడడానికి సింపుల్‌గా ఉన్నా.. ఈ గేమ్ వల్ల చాలామంది ఉన్మాదులుగా మారిపోతున్నారు. డాక్టర్స్, నిపుణులు కూడా ఆన్లైన్ గేమ్స్‌కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి హింసాత్మక ఆటలను నిషేధిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

Related Tags