కరోనా పోర్టబుల్ దవాఖాన.. ఐఐటీ మద్రాస్ ఆవిష్కరణ..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కోవిద్-19 పేషెంట్లకు చికిత్స అందించేందుకు కొత్త మెడికాబ్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్

కరోనా పోర్టబుల్ దవాఖాన.. ఐఐటీ మద్రాస్ ఆవిష్కరణ..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 5:45 PM

IIT-Madras startup: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కోవిద్-19 పేషెంట్లకు చికిత్స అందించేందుకు కొత్త పోర్టబుల్ హాస్పిటల్ మెడికాబ్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-ఎం) తయారుచేసింది. ఈ దవాఖానను కేవలం 4 గంటల్లో ఎక్కడైనా తయారు చేసుకునే వీలుంది. పోర్టబుల్ హాస్పిటల్ మెడికాబ్.. కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో గేమ్ ఛేంజర్ అని భావించవచ్చు. కరోనా రోగులను స్థానికంగా గుర్తించడం, పరీక్షించడం, వేరుచేయడం, చికిత్స చేయడంలో మెడికాబ్ సహాయపడుతుంది.

ఐఐటీ-ఎం, స్టార్టప్ శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి దీనిని ఆవిష్కరించింది. ఈ పోర్టబుల్ హాస్పిటల్ ను రవాణా చేయడం చాలా సులువైనందున తక్కువ ఖర్చు అవుతుంది. ఈ పోర్టబుల్ దవాఖానను ఇటీవల కేరళలోని వయనాడ్‌లో ప్రారంభించారు. కరోనా రోగుల చికిత్స కోసం ఇటువంటి సూక్ష్మ ఆసుపత్రుల అభివృద్ధి ఎంతో కీలకం కానున్నాయి. వీటిని దేశవ్యాప్తంగా నగరం, గ్రామంలో ఎక్కడైనా సులభంగా నిర్వహించుకునే వీలున్నది. మెడికాబ్ లో డాక్టర్ రూమ్, ఐసోలేషన్ రూమ్, మెడికల్ రూమ్ / వార్డ్ , రెండు పడకలతో కూడిన ఐసీయూ ఉన్నాయి.

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!