గుడ్ న్యూస్: విమాన ప్రయాణీకులకోసం ‘ఫ్లైజీ’ యాప్..!

విమానాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, ఒత్తిడి లేని సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి అందుబాటులో ఉండేలా ఓ మొబైల్‌ యాప్‌ను తయారుచేశారు ఐఐటీ గౌహతి విద్యార్థులు. విమానాల వేళల నుంచి విమానాశ్రయంలో లభించే ఆహారం వరకు సకల సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. అంతేకాదు ‘ఫ్లైజీ’ అని పేరుపెట్టిన ఈ యాప్‌ ద్వారా అనేక దేశాల కరెన్సీల్లో పేమెంట్లు కూడా చేసే వీలున్నది. విమానం గంట లేటుగా బయల్దేరే పరిస్థితి ఉంటే ఆ గంటలో మీరు అక్కడ ఆర్డర్‌ […]

గుడ్ న్యూస్: విమాన ప్రయాణీకులకోసం 'ఫ్లైజీ' యాప్..!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 10:46 PM

విమానాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, ఒత్తిడి లేని సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి అందుబాటులో ఉండేలా ఓ మొబైల్‌ యాప్‌ను తయారుచేశారు ఐఐటీ గౌహతి విద్యార్థులు. విమానాల వేళల నుంచి విమానాశ్రయంలో లభించే ఆహారం వరకు సకల సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. అంతేకాదు ‘ఫ్లైజీ’ అని పేరుపెట్టిన ఈ యాప్‌ ద్వారా అనేక దేశాల కరెన్సీల్లో పేమెంట్లు కూడా చేసే వీలున్నది. విమానం గంట లేటుగా బయల్దేరే పరిస్థితి ఉంటే ఆ గంటలో మీరు అక్కడ ఆర్డర్‌ ఇచ్చి తినగలిగే ఆహారం ఏమిటి? అనేది కూడా ఈ యాప్‌ తెలుపుతుంది. దీంతో షాపింగ్‌ కూడా ఎంచక్కా చేసేయొచ్చు.

డీజీసీఏ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ యాప్‌ కరోనా సంక్షోభం తర్వాత కూడా విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని రూపొదించిన బీటెక్‌ విద్యార్థులు దీపక్‌మీనా, హంన్స్‌రాజ్‌ పటేల్‌, అర్జిత్‌సింగ్‌ తెలిపారు. ముఖ్యంగా కొత్తగా విమాన ప్రయాణం చేసేవారికి ఈ యాప్‌ మార్గదర్శిగా ఉంటుందని చెప్తున్నారు.