క‌రోనాపై మ‌రో షాకింగ్ న్యూస్‌..మురుగు నీటిలో వైర‌స్ !

దేశంలో కోవిడ్-19 భూతం క‌రాళ నృత్యం చేస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైర‌స్‌తో ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీ ప‌డుతున్న భార‌త్ ఇప్ప‌టికే ఐద‌వ స్థానానికి చేరుకుంది. క‌రోనా ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ‌ ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు మ‌రో షాకింగ్ న్యూస్‌ వెల్లడించారు.

క‌రోనాపై మ‌రో షాకింగ్ న్యూస్‌..మురుగు నీటిలో వైర‌స్ !
Follow us

|

Updated on: Jun 09, 2020 | 8:45 PM

దేశంలో కోవిడ్-19 భూతం క‌రాళ నృత్యం చేస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైర‌స్‌తో ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీ ప‌డుతున్న భార‌త్ ఇప్ప‌టికే ఐద‌వ స్థానానికి చేరుకుంది. క‌రోనా ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ‌ ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు మ‌రో షాకింగ్ న్యూస్‌ వెల్లడించారు. మన దేశంలోని మురుగు కాల్వల్లో కోవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. అహ్మదాబాద్‌లో శుద్ధి చేయని మురుగు నీటి శాంపిళ్లను సేకరించగా.. కరోనా జన్యువులు ఉన్నట్లు ఐఐటీ గాంధీ నగర్ పరిశోధకులు గుర్తించారు.

క‌రోనా బారిన పడిన లక్షణాలు ఉన్న వారిలో మాత్రమే కాకుండా లేని వారి శరీరంలోనూ వైరస్ ఉంటుందనే సంగతి తెలిసిందే. విసర్జన ద్వారా అవి శరీరం నుంచి మురుగునీటి క్వాల్లోకి చేరతాయి. దీంతో వృథా జలాల్లో కరోనా ఆనవాళ్లు కనిపిస్తే ఆ ప్రాంతంలో కరోనా కేసులు బయటపడనప్పటికీ… ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఉన్నట్లు గుర్తించొచ్చని ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ మనీష్ కుమార్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో కోవిడ్ కట్టడి కోసం వృథా జలాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని వారు స్ప‌ష్టం చేస్తున్నారు.

అయితే, మురుగు నీటిలోని వైరస్ మరొకరికి సంక్రమించదని పరిశోధనల్లో తేలిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబ‌తున్నారు. అంతేకాదు నీటిలో వైరస్ మనుగడ సాగించడంపై ఉష్ణోగ్రత లాంటి పర్యావరణ అంశాలు ప్రభావితం చేస్తాయ‌ని చెబుతున్నారు. మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించడం ద్వారా ఓ ప్రాంతంలో కోవిడ్ ఉందా లేదా అనే విషయమై ప్రాథమికంగా అవగాహనకు రావచ్చని పరిశోధకులు వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, అమెరికాల్లో మురుగు నీటిలో కోవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. మురుగు నీటిలో కరోనా ఆనవాళ్ల విషయమై 51 యూనివర్సిటీల గ్లోబల్ కన్సార్టియంలో ఐఐటీ గుజరాత్ కూడా చేరింది.