మూడు నిమిషాల్లో మాయ జరిగింది…గోవా ఎఫ్‌సీని ఓటమి నుంచి బయట పడింది

66, 69వ నిమిషాల్లో ఎంజు గోల్స్ చేశాడు. ఆ తర్వాత గెలుపు గోల్‌ కోసం రెండు జట్లూ చివరి దాకా పోరాడింది. దీంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. ఫుట్ బాల్ ప్రియులకు మంచి ఆనందాన్ని పంచింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.

మూడు నిమిషాల్లో మాయ జరిగింది...గోవా ఎఫ్‌సీని ఓటమి నుంచి బయట పడింది
Follow us

|

Updated on: Nov 23, 2020 | 3:55 PM

Thrilling Tie : మూడు నిమిషాల్లో అద్భుతం… ఫుట్ బాల్ ఆటలో నిజమైన వినోదం.. బెంగళూరు ఎఫ్‌సీ, గోవా ఎఫ్‌సీ మధ్య జరిగిన పోరు ఉత్కంఠభరితంగా సాగింది.  ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఏడో సీజన్‌లో భాగంగా  హాట్ హాట్‌గా సాగిన జరిగిన మ్యాచ్‌ చివరకు ‘డ్రా’గా ముగిసింది.

బెంగళూరు ఎఫ్‌సీ, గోవా ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ చివరకు 2-2తో సమమైంది. ఓటమి ఖాయం అనుకున్న సమయంలో  గోవా ఎఫ్‌సీ ఫార్వర్డ్‌ ఇగోర్‌ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి జట్టుకు ఓటమి నుంచి తప్పించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్‌ మాత్రమే నమోదు కాగా.. మూడో మ్యాచ్‌ మాత్రం అసలైన సాకర్‌ను తలపించింది. క్రికెట్ పొట్టి ఆట.. ఐపీఎల్‌ను మించిన స్థాయిలో పోరు జరిగింది.

సునీల్‌ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్‌జోత్‌ సింగ్‌ లాంగ్‌ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన క్లెటాన్‌ సిల్వా.. తలతో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపి బెంగళూరుకు 1-0తో జట్టుకు ఆధిక్యాన్నిచ్చాడు.

ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్‌ ఎండెల్‌ హెడర్‌ ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన ఆంటోనియో గొంజాలెజ్‌ బెంగళూరును 2-0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా అంతా అనుకున్న సమయంలో మ్యాచ్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఆ మూడు నిమిషాలు బెంగళూరు విజయాన్ని మార్చేసింది.

అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్‌ ఎంజు మార్చేశాడు. అల్బెర్టో, జెసురాజ్‌ ఇచ్చిన పాస్‌లను గోల్స్‌గా మలిచి.. మ్యాచ్‌ను తిప్పేశాడు. 66, 69వ నిమిషాల్లో ఎంజు గోల్స్ చేశాడు. ఆ తర్వాత గెలుపు గోల్‌ కోసం రెండు జట్లూ చివరి దాకా పోరాడింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఫుట్ బాల్ ప్రియులకు మంచి ఆనందాన్ని పంచింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.