చిన్నమ్మ విడుదల లేనట్లే

సత్ప్రవర్తన కింద శశికళను ముందస్తుగా విడుదల చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఐజీ రూప ఖండించారు. శశికళను ముందస్తుగా విడుదల చేయడం వీలుకాదని ఆమె అన్నారు. నేరస్తులను సత్ర్పవర్తన కారణంగా ముందస్తుగా విడుదల చేసే అవకాశం ఉందని, అయితే శశికళ విషయంలో ఇది వీలుకాదని ఆమె స్పష్టం చేశారు. అయితే 1991-96 అన్నాడీఎంకే హయాంలో జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు కేసు దాఖలైంది. ఈ కేసులో సుప్రీం కోర్టు 2017 ఫిబ్రవరిన […]

చిన్నమ్మ విడుదల లేనట్లే
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 10:08 AM

సత్ప్రవర్తన కింద శశికళను ముందస్తుగా విడుదల చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఐజీ రూప ఖండించారు. శశికళను ముందస్తుగా విడుదల చేయడం వీలుకాదని ఆమె అన్నారు. నేరస్తులను సత్ర్పవర్తన కారణంగా ముందస్తుగా విడుదల చేసే అవకాశం ఉందని, అయితే శశికళ విషయంలో ఇది వీలుకాదని ఆమె స్పష్టం చేశారు.

అయితే 1991-96 అన్నాడీఎంకే హయాంలో జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు కేసు దాఖలైంది. ఈ కేసులో సుప్రీం కోర్టు 2017 ఫిబ్రవరిన తీర్పునిచ్చింది. అయితే అప్పటికే జయలలిత మృతి చెందడంతో మిగిలిన వారికి జైలు శిక్షను విధించారు. దీంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ 2017 ఫిబ్రవరి 15నుంచి బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో నిర్భంధించిన విషయం తెలిసిందే.