శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలే: ఏపీ హోం మంత్రి వార్నింగ్

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ప్రతీకార దాడులు మంచివి కాదని అన్న ఆమె.. ఎవరైనా హింసకు దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని.. పోలీసులపై 24గంటల పనిభారాన్ని తగ్గించడానికి పరిశీలిస్తున్నామని సుచరిత తెలిపారు. గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతకు […]

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలే: ఏపీ హోం మంత్రి వార్నింగ్
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 1:14 PM

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ప్రతీకార దాడులు మంచివి కాదని అన్న ఆమె.. ఎవరైనా హింసకు దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని.. పోలీసులపై 24గంటల పనిభారాన్ని తగ్గించడానికి పరిశీలిస్తున్నామని సుచరిత తెలిపారు. గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సుచరిత పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో సుచరిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈ భేటీలో డీజీపీ కార్యాలయాన్ని సందర్శించాలని గౌతమ్ సవాంగ్ సుచరితను కోరగా.. అందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.