#IndiaVsAustralia2020: టీమిండియా లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌ల్లో గెలవకపోతే, టెస్ట్‌ సిరీస్‌ వైట్‌వాషే!

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాకు మైకేల్‌ క్లార్క్‌ హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు.. వన్డే సిరీస్‌ను, టీ-20 సిరీస్‌ను టీమిండియా కచ్చితంగా గెలవాలని, అప్పుడే టెస్ట్‌ సిరీస్‌లో ఛాన్స్‌ ఉంటుందని ఆస్ట్రేలియా టీమ్‌ను గతంలో..

#IndiaVsAustralia2020: టీమిండియా లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌ల్లో గెలవకపోతే, టెస్ట్‌ సిరీస్‌ వైట్‌వాషే!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 24, 2020 | 7:43 PM

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాకు మైకేల్‌ క్లార్క్‌ హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు.. వన్డే సిరీస్‌ను, టీ-20 సిరీస్‌ను టీమిండియా కచ్చితంగా గెలవాలని, అప్పుడే టెస్ట్‌ సిరీస్‌లో ఛాన్స్‌ ఉంటుందని ఆస్ట్రేలియా టీమ్‌ను గతంలో లీడ్‌ చేసిన క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు.. ఒకవేళ వన్డే, టీ-20 సిరీస్‌లలో టీమిండియా ఓడిపోతే మాత్రం టెస్ట్‌ సిరీస్‌లో 0-4తో వైట్‌వాష్‌ తప్పదని హెచ్చరించాడు. లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచుల్లో ప్లేయర్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉందని క్లార్క్‌ చెప్పాడు. లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లలో టీమ్‌ను గెలిపించి, ఆపై తొలి టెస్ట్‌ ఆడిన తర్వాత కోహ్లీ స్వదేశానికి వెళ్లిపోతే మిగతా మూడు టెస్ట్‌లలో టీమిండియా మంచి ప్రదర్శన చేయగలదని క్లార్క్‌ అన్నాడు. అలా కానీ పక్షంలో మాత్రం ఒక్క టెస్ట్ మ్యాచ్‌ కూడా టీమిండియా గెలవలేదని అన్నాడు. ఇండియా విజయంలో బుమ్రా కీలకం కాబోతున్నాడని క్లార్క్‌ తెలిపాడు. బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ విభిన్నంగా ఉంటుందని, బంతులను వేగంగా విసరగలడని అన్నాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌కు జోఫ్రా ఆర్చర్‌ ఎలా బౌలింగ్ చేశాడో ఇప్పుడు బుమ్రా కూడా అలాగే బౌలింగ చేయాలని క్లార్క్‌ సలహా ఇచ్చాడు.