టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై మోసం చేస్తున్నాయి, బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ : బండి సంజయ్

గ్రేటర్ ఎన్నికల్లో తాము విజయం సాధించగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో పాకిస్తానీలు,

  • Venkata Narayana
  • Publish Date - 2:58 pm, Tue, 24 November 20

గ్రేటర్ ఎన్నికల్లో తాము విజయం సాధించగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో పాకిస్తానీలు, రోహింగ్యాలు నివాసం ఉంటూ ఓట్లు వేస్తున్నారని సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మేయర్ అవడం ఖామయని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని సంజయ్ ఆరోపించారు.

అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కాగా, దుబ్బాక ఉప ఎన్నికలో సాధించిన విజయంతో జోష్ మీద ఉన్న బీజేపీ అదే ఊపుతో జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగుర వేయాలని వ్యూహాలు రచిస్తోంది. హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిష్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ ముఖ్య మంత్రి యోగీ ఆదిత్యనాథ్ సైతం బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.