కేంద్రంలో బిజెపికి మెజార్టీ వస్తే మేము ఆ పని చేస్తాం: కవిత

హైదరాబాద్: కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వస్తే టీఆర్ఎస్ పార్టీ సేమ్ సీన్ రిపీట్ చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. గతంలో మాదిరిగానే రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను సాధించుకునేందుకు 16 ఎంపీలం కలిసి కొట్లాడతామని చెప్పారు. ప్రభుత్వానికి బయట ఉండి పోరాడతామని తెలిపారు. అయితే తాము భారత దేశ గతిని మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నామని కవిత అన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణ మంచి పురోగతిని సాధించింది. రైతులకు 24 గంటల విద్యుత్‌ను […]

కేంద్రంలో బిజెపికి మెజార్టీ వస్తే మేము ఆ పని చేస్తాం: కవిత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2019 | 4:48 PM

హైదరాబాద్: కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వస్తే టీఆర్ఎస్ పార్టీ సేమ్ సీన్ రిపీట్ చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. గతంలో మాదిరిగానే రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను సాధించుకునేందుకు 16 ఎంపీలం కలిసి కొట్లాడతామని చెప్పారు. ప్రభుత్వానికి బయట ఉండి పోరాడతామని తెలిపారు. అయితే తాము భారత దేశ గతిని మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నామని కవిత అన్నారు.

గత ఐదేళ్లలో తెలంగాణ మంచి పురోగతిని సాధించింది. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు పథకం ఒక్క తెలంగాణలోనే ఉంది. ఇలాంటి అభివృద్ధి దేశమంతా జరగాలంటే జాతీయ స్థాయిలో జరిగే విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేయగల స్థాయిలో టీఆర్ఎస్ ఉండాలి. అలా ఉండాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని కవిత చెప్పారు.