చార్మినార్‌కు పగుళ్లు..డేంజర్లో చారిత్రక కట్టడం

పురాతన కట్టడం, భాగ్యనగరానికే తలమానికం అయిన చార్మినార్‌లోని చిన్న భాగం కూలింది. నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగిపోయి కింద పడింది. ఆ సమయంలో చార్మినార్ వద్ద పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. […]

చార్మినార్‌కు పగుళ్లు..డేంజర్లో చారిత్రక కట్టడం
Follow us

| Edited By: Srinu

Updated on: May 02, 2019 | 7:54 PM

పురాతన కట్టడం, భాగ్యనగరానికే తలమానికం అయిన చార్మినార్‌లోని చిన్న భాగం కూలింది. నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగిపోయి కింద పడింది. ఆ సమయంలో చార్మినార్ వద్ద పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. ఈ విధంగా శుభ్రం చేసి, రంగు వేసిన ఒక మినార్ నుంచి చిన్న భాగం ఇప్పుడు కూలింది.

హైదరాబాద్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్‌. దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్‌ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అంటే చార్మినార్ నిర్మించి దాదాపు 428 సంవత్సరాలైంది. ఈ నిర్మాణానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కువగా ప్రబలింది. ఆ వ్యాధి పూర్తిగా నయమైన శుభవేళను కలకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో చార్మినార్‌ నిర్మాణం జరిగిందని కొందరు చెబితే.. కుతుబ్‌షాహీ పాలకుల విజయ వైభవానికి ప్రధాన సింహద్వారంలాగా చార్మినార్‌ నిర్మించారని ఇంకొందరు చెబుతున్నారు.

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..