కొవిడ్ వ్యాక్సిన్ వివరాలతో ఐసీఎంఆర్ పోర్టల్‌

దేశంలో వివిధ వ్యాధుల నిరోధక వ్యాక్సిన్లకు సంబంధించిన మొత్తం సమాచారంతో కూడిన పోర్టల్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అభివృద్ధిపరుస్తోంది. దీనిని వచ్చే వారానికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

కొవిడ్ వ్యాక్సిన్ వివరాలతో ఐసీఎంఆర్ పోర్టల్‌
Follow us

|

Updated on: Aug 23, 2020 | 3:04 PM

దేశవ్యాప్తంగా కరోనాతో సుమారు ఎనిమిది నెలలుగా పోరాడుతున్నాం. 57వేల మందిని పోగొట్టుకున్నాం. కానీ ఇదే పరిస్థితుల్లో త్వరలోనే భారత్‌ నుంచి కరోనా వ్యాక్సిన్‌ వచ్చేస్తుందనే భరోసాను కలిగిస్తున్నాయి పరిశోధనలు. దేశంలో వివిధ వ్యాధుల నిరోధక వ్యాక్సిన్లకు సంబంధించిన మొత్తం సమాచారంతో కూడిన పోర్టల్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అభివృద్ధిపరుస్తోంది. దీనిని వచ్చే వారానికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మన దేశంలో ఇటువంటి పోర్టల్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి అవుతుంది.

భారత దేశంలో వ్యాక్సిన్లకు సంబంధించిన యావత్తు సమాచారాన్ని ప్రజలు ఒకే చోట పొందవచ్చునని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పాండా తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు తాము ఐసీఎంఆర్ వ్యాక్సిన్ పోర్టల్‌ను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. మొదట్లో ఈ వెబ్‌సైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. క్రమంగా ఇతర వ్యాధుల నిరోధక వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇందులో పొందుపర్చనున్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీఎంఆర్ అనేది బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని పాండా స్పష్టం చేశారు. మరోవైపు భారత్‌ అభివృద్ధి చేస్తున్న మూడు వ్యాక్సిన్‌లపై ప్రపంచం దృష్టిపడింది. ప్రపంచంలోని పలు దేశాలకు భారత్‌ నుంచే వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా జరుగుతాయని భావి స్