దేశీయ కోవిడ్ టెస్ట్ కిట్.. గంటన్నరలోనే ఫలితం..!

COVID-19 Test Kit Developed By IISC Startup: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అలాగే కొన్ని చోట్లా కరోనా పరీక్షలు పూర్తయ్యాక రిపోర్టు కోసం ఇంకా గంటల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు భిన్నంగా గంటన్నరలోనే కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించే ర్యాపిడ్‌ కరోనా టెస్ట్ కిట్లను బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) అభివృద్ధి చేసింది. ఈ దేశీయ […]

దేశీయ కోవిడ్ టెస్ట్ కిట్.. గంటన్నరలోనే ఫలితం..!
Follow us

|

Updated on: Sep 26, 2020 | 8:15 PM

COVID-19 Test Kit Developed By IISC Startup: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అలాగే కొన్ని చోట్లా కరోనా పరీక్షలు పూర్తయ్యాక రిపోర్టు కోసం ఇంకా గంటల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు భిన్నంగా గంటన్నరలోనే కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించే ర్యాపిడ్‌ కరోనా టెస్ట్ కిట్లను బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) అభివృద్ధి చేసింది. ఈ దేశీయ కోవిడ్ టెస్టింగ్ కిట్లకు ఐసీఎంఆర్ నుంచి అనుమతులు కూడా లభించాయి. దేశీయంగా తయారైన ఈ ఆర్టీపీసీఆర్ కిట్లతో గంటన్నరలోపే కరోనా టెస్ట్ రిజల్ట్స్ వస్తాయని ఐఐఎస్‌సీ స్పష్టం చేసింది. అలాగే దేశంలోని అన్ని ల్యాబ్‌లలోనూ ఈ కిట్ల ద్వారా కరోనా టెస్టులకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.

Also Read:

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..