Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

కొచ్చర్‌కు కొత్త చిక్కులు

, కొచ్చర్‌కు కొత్త చిక్కులు

ముంబయి:ఇప్పటికే వీడియోకాన్ గ్రూప్‌కు పేవర్ చేశారన్న ఎలిగేషన్స్‌కి సంభందించి క్విడ్ ప్రోకో కేసును ఎదుర్కుంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు కొత్త సమస్యలు చుట్టుకుంటున్నాయి. ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ పై త్వరలోనే ఆదాయపన్ను అధికారులు బినామీ వ్యవహారాల వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించనున్నారు. గతంలో పన్ను ఎగవేతకు సంబంధించి చేసిన దర్యాప్తులో పెద్దగా పురోగతి లేకపోవడంతో బినామీ వ్యతిరేక చట్టం కింద దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు.

గత ఏడాది విచారణ సందర్భంగా దీపక్‌కొచ్చర్‌ను సింగపూర్‌కు చెందిన కంపెనీ ఏడీఎస్‌ఎఫ్‌ తన సబ్సిడరీ డీహెచ్‌ రెనీవబుల్‌ హోల్డింగ్స్‌ ద్వారా పెట్టిన రూ.405 కోట్ల పెట్టుబడులపై వివరాలు ఇచ్చారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు. మనీలాండరింగ్‌, నగదును వేర్వేరు మార్గాల్లో కంపెనీలోకి తీసుకొచ్చినట్లు అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నివేదికను ఈడీతో పంచుకొన్నారు.