లాక్ డౌన్ ఎఫెక్ట్: అందుబాటులో.. ఐసీఐసీఐ మొబైల్ ఏటీఎంలు..

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాకింగ్ సంస్థ ఐసీఐసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడాతోపాటు

లాక్ డౌన్ ఎఫెక్ట్: అందుబాటులో.. ఐసీఐసీఐ మొబైల్ ఏటీఎంలు..
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 5:57 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాకింగ్ సంస్థ ఐసీఐసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడాతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాల్లో రెండు మొబైల్ ఏటీఎంలను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే వారం నుంచే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజల వద్దకే బ్యాంకింగ్ సేవలను తీసుకెళ్లాని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా ఐసీఐసీఐ తెలిపింది.

కాగా.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇవి అధికారులు క్వారంటైన్ విధించిన ప్రాంతాల్లో తిరుగుతాయని బ్యాంకు తెలిపింది. సాధారణ ఏటీఎంలలో లభించే అన్ని సేవలు ఈ మొబైల్ ఏటీఎంలలో లభిస్తాయని పేర్కొంది. నగదు ఉపసంహరణతోపాటు నగదు బదిలీ, పిన్ మార్పిడి, మొబైల్ ఫోన్ల రీచార్జ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ వంటి సేవలు లభిస్తాయని వివరించింది. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లోని రెసిడెన్షియల్ సొసైటీల్లో ఇప్పటికే ఏటీఎం వ్యాన్లను మోహరించినట్టు ఐసీఐసీఐ తెలిపింది.

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే