ఐసీఐసీఐ వినియోగదారులకు చేదు వార్త..!

కరోనా వేళ.. పలు బ్యాంకులు కస్టమర్లకు షాకింగ్ ఇస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవింగ్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దేశీయంగా అతిపెద్ద బ్యాంక్ అయితన ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అకౌంట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. తాజాగా ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రధాన బ్యాంకులు కూడా అదే బాటపడుతున్నాయి. ప్రైవేట్ రంగంలోని కీలక బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. టర్మ్ ఫిక్సిడ్ […]

ఐసీఐసీఐ వినియోగదారులకు చేదు వార్త..!
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 4:35 PM

కరోనా వేళ.. పలు బ్యాంకులు కస్టమర్లకు షాకింగ్ ఇస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవింగ్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దేశీయంగా అతిపెద్ద బ్యాంక్ అయితన ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అకౌంట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. తాజాగా ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రధాన బ్యాంకులు కూడా అదే బాటపడుతున్నాయి.

ప్రైవేట్ రంగంలోని కీలక బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. టర్మ్ ఫిక్సిడ్ డిపాజిట్‌ అకౌంట్లపై ఉన్న వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు.. ఈ తగ్గించిన రేట్లు మే 11వ తేదీ నుంచే అమలుకానున్నట్లు తెలిపింది. బ్యాంకు ప్రకటించిన తాజా నిర్ణయంతో.. ఏడాది టర్మ్‌తో ఉన్న ఎఫ్‌డీ అకౌంట్లపై ఇక నుంచి 5.25 శాతం వడ్డీ వస్తుంది. అదే ఏడాదికంటే ఎక్కువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌పై 5.7- 5.75 శాతం మధ్య వడ్డీ రానుంది.