గ్రీన్‌లాండ్ మంచు కరిగిందా.. అంతే సంగతులు

గ్రీన్‌లాండ్ అంటే మంచుదుప్పటికి కేరాఫ్ అడ్రస్.. అలాంటి ఆ ఐస్ పై కుక్కలతో సామాగ్రిని తరలిస్తుంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాను రాను గ్రీన్‌లాండ్‌లో ఐస్ కరిగిపోతోంది. ఈ నీటిలోనే ఇప్పుడు కుక్కలు సైంటిస్టుల సామాగ్రిని తీసుకెళుతున్నాయి. పర్యావరణ మార్పులు ఎంతలా గ్రీన్​లాండ్​ను ప్రభావితం చేస్తున్నాయో చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే […]

గ్రీన్‌లాండ్ మంచు కరిగిందా.. అంతే సంగతులు
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 1:38 PM

గ్రీన్‌లాండ్ అంటే మంచుదుప్పటికి కేరాఫ్ అడ్రస్.. అలాంటి ఆ ఐస్ పై కుక్కలతో సామాగ్రిని తరలిస్తుంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాను రాను గ్రీన్‌లాండ్‌లో ఐస్ కరిగిపోతోంది. ఈ నీటిలోనే ఇప్పుడు కుక్కలు సైంటిస్టుల సామాగ్రిని తీసుకెళుతున్నాయి. పర్యావరణ మార్పులు ఎంతలా గ్రీన్​లాండ్​ను ప్రభావితం చేస్తున్నాయో చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు నిపుణులు.

ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో వెల్లడించింది. దాంతోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఇదే పరిస్థితి కొనసాగితే 3000 సంత్సరానికల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై కొందరు నిపుణులు అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా కలిపి పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం ఉన్న దానికన్నా కర్బనవాయువులు ఎక్కువగా ఉత్పన్నమైతే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్‌ ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్‌ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమని చెబుతున్నారు. కర్బన వాయువులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు