వరల్డ్ కప్ 2019: ప్రైజ్ మనీ వివరాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

వరల్డ్ కప్‌పై ఫైనల్ మ్యాచ్‌కు 80 శాతం టికెట్లను భారతీయులే కొన్నారన్న విషయం మీకు తెలుసా!. అవును నిజమే..దుర్భేద్యమైన ఫామ్‌లో ఉన్న భారత్ పక్కాగా ఫైనల్‌కు వెళ్తుందని మన ఫ్యాన్స్‌కు అంత నమ్మకం. కానీ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులతో ఓడిపోయి మనవాళ్లు మెగాటోర్నీ బరిలోంచి తప్పుకున్నారు. అయితే సెమీస్ వరకు వచ్చిన మన టీంకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో తెలుసా? సెమీఫైనల్లో ఓడిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) […]

వరల్డ్ కప్ 2019: ప్రైజ్ మనీ వివరాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!
Follow us

|

Updated on: Jul 14, 2019 | 12:24 PM

వరల్డ్ కప్‌పై ఫైనల్ మ్యాచ్‌కు 80 శాతం టికెట్లను భారతీయులే కొన్నారన్న విషయం మీకు తెలుసా!. అవును నిజమే..దుర్భేద్యమైన ఫామ్‌లో ఉన్న భారత్ పక్కాగా ఫైనల్‌కు వెళ్తుందని మన ఫ్యాన్స్‌కు అంత నమ్మకం. కానీ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులతో ఓడిపోయి మనవాళ్లు మెగాటోర్నీ బరిలోంచి తప్పుకున్నారు.

అయితే సెమీస్ వరకు వచ్చిన మన టీంకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో తెలుసా?

సెమీఫైనల్లో ఓడిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సుమారు రూ.5.60 కోట్లు (0.8 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లు. లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు గాను జట్టుకు సుమారు రూ.27.4 లక్షలు (40 వేల డాలర్లు) చొప్పున అందిస్తారు. అయితే సెమిస్‌కు చేరిన ప్రతి జట్టుకూ 0.8 మిలియన్ డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కుతుందని ఐసీసీ తెలిపింది. దీని ప్రకారం భారత్, ఆస్ట్రేలియా జట్లకు రూ.5.60 కోట్లు ప్రైజ్ మనీని అందుకుంటారు. అయితే ఫైనల్‌గా కప్‌ని గెలుచుకున్న విజేతలకు 4 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ.27.42 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్‌కు 2 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.14.02 కోట్లు దాదాపుగా లభిస్తుంది.