వాల్డ్ కప్ సంరంభం.. వేదిక ఇంగ్లాండ్

ఐసీసీ వాల్డ్ కప్-2019 సంరంభానికి ఇక ఆట్టే కాలం లేదు. ఈ నెల 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లాండ్, వేల్స్ లో ఈ మహాసంగ్రామం జరగబోతోంది. ఇంగ్లీషు గడ్డపై జరిగే ఇవి ఐదో వాల్డ్ కప్ పోటీలు. 1983 లో కపిల్ దేవ్ సారథ్యంలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన వాల్డ్ కప్ లో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఇక ఈ సారి ఇంగ్లాండ్, వేల్స్ లో 11 స్టేడియాలలో, 46 రోజులపాటు 48 మ్యాచ్ లు జరగనున్నాయి. జులై 14 న లార్డ్స్ మైదానంలో ఫైనల్నిర్వహిస్తారు. మ్యాచ్ లు జరిగే వెన్యూస్ ఇలా ఉన్నాయి. బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్, కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్, చెస్టర్-లె-స్ట్రీట్ లో గల రివర్ సైడ్ గ్రౌండ్, బర్మింగ్ హామ్ లోని ఎడ్గ్ బాస్టన్, లీడ్స్ లోని  హెడెంగ్లె గ్రౌండ్,
లండన్ లోని లార్డ్స్, ఓవల్ గ్రౌండ్స్, మాంచెస్టర్ లో గల ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియాలలో వీటిని నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *