పోరాడి ఓడిన విండీస్

తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టించి చిత్తుచిత్తుగా ఓడించిన వెస్టీండిస్… ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. 15 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. స్టార్క్‌తో కలిసి కమిన్స్ రాణించడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులకే పరిమితమైంది. తొలుత టాస్ ఓడి బ్యాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్.. కరేబియన్ బౌలర్ల ధాటితో పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే చివర్లో విండీస్ బౌలర్లు.. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేయకపోవడంతో పరుగుల వర్షం […]

పోరాడి ఓడిన విండీస్
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 7:42 AM

తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టించి చిత్తుచిత్తుగా ఓడించిన వెస్టీండిస్… ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. 15 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. స్టార్క్‌తో కలిసి కమిన్స్ రాణించడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులకే పరిమితమైంది.

తొలుత టాస్ ఓడి బ్యాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్.. కరేబియన్ బౌలర్ల ధాటితో పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే చివర్లో విండీస్ బౌలర్లు.. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేయకపోవడంతో పరుగుల వర్షం కురిపించారు. ఒకానొక దశలో స్కొర్ 300 దాటుతుందని అంతా భావించారు. అయితే 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. అయితే విండీస్ బ్యాట్స్‌మెన్స్ దూకుడుగా ఆడేందుకు యత్నించి.. ఆసీస్‌ బౌలర్లకు వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో విండీస్ ఓటమిపాలైంది.