Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

పాక్ సెమీస్ భవితవ్యం.. ‘టాస్‌’ చేతిలో

, పాక్ సెమీస్ భవితవ్యం.. ‘టాస్‌’ చేతిలో

క్రికెట్ వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌కు చేరకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ దేశాలు సెమీస్‌కు బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్టు పోటీ పడుతున్నాయి. అయితే రన్‌రేట్‌లో పాక్ కంటే మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్‌కే నాలుగో స్థానం కన్ఫర్మ్ అని అందరూ భావిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్‌పై గెలిచి ఎలాగైనా ఈ సెమీస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని పాక్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యంతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాక్ భవితవ్యం టాస్ నుంచే మొదలవుతుంది.

రేపటి మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేస్తేనే పాక్‌కు కాస్త ఊరటగా ఉంటుంది. అలాకాకుండా ఒకవేళ బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం పాక్ సెమీస్ ఆశలు గల్లంతయినట్లే. ఇదంతా కాకుండా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టినా.. పాక్ ముందు భారీ లక్ష్యం ఉంది. మ్యాచ్‌ గెలిస్తే పాక్‌కు 2 పాయింట్లు వచ్చి న్యూజిలాండ్‌తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్‌రేట్ విషయంలో ఆ దేశం ముందు 316పరుగుల లక్ష్యం ఉంది. ఉదాహరణకు పాకిస్తాన్ 450పరుగులు చేసి, 129 పరుగులకే బంగ్లా ఓడించాలి. లేదంటే 400 పరుగులు చేసి, 316పరుగుల తేడాతో.. 350 పరుగులు చేసి 312 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాల్సి వస్తుంది. అంటే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాక్ విజయం సాధించాలి. మరి పాక్ భవితవ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే.

Related Tags