భారత బ్యాట్స్‌మెన్‌కి కివీస్ బౌలర్ వార్నింగ్

ఈ నెల 9న న్యూజిలాండ్‌తో భారత్ వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌‌ను ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే టోర్నీలోనే అద్భుత గణాంకాలు నమోదు చేసి..150కిమీ వేగంతో బంతులు విసురుతూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లని వణికిస్తున్న లూకీ ఫర్గూసన్ భారత టీంకు వార్నింగ్ ఇచ్చాడు.  తన షార్ట్ పిచ్ బంతులతో భారత్‌‌కి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లాడి 17 వికెట్లు పడగొట్టిన ఫర్గూసన్.. తన బలమే షార్ట్ పిచ్ బంతులని.. సెమీస్‌ మ్యాచ్‌లోనూ ఎక్కువగా వాటినే […]

భారత బ్యాట్స్‌మెన్‌కి కివీస్ బౌలర్ వార్నింగ్
Follow us

|

Updated on: Jul 08, 2019 | 4:38 PM

ఈ నెల 9న న్యూజిలాండ్‌తో భారత్ వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌‌ను ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే టోర్నీలోనే అద్భుత గణాంకాలు నమోదు చేసి..150కిమీ వేగంతో బంతులు విసురుతూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లని వణికిస్తున్న లూకీ ఫర్గూసన్ భారత టీంకు వార్నింగ్ ఇచ్చాడు.  తన షార్ట్ పిచ్ బంతులతో భారత్‌‌కి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లాడి 17 వికెట్లు పడగొట్టిన ఫర్గూసన్.. తన బలమే షార్ట్ పిచ్ బంతులని.. సెమీస్‌ మ్యాచ్‌లోనూ ఎక్కువగా వాటినే టీమిండియా బ్యాట్స్‌మెన్‌లపైకి సంధిస్తానని చెప్తున్నాడు.

లీగ్ దశలో ఒక్క ఇంగ్లాండ్‌పై మినహా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాల్ని అందుకున్న టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా.. మూడు పరాజయాల్ని చవిచూసిన న్యూజిలాండ్‌ నాలుగో స్థానంతో సరిపెట్టి సెమీస్‌కి చేరింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ రెండు జట్ల మధ్య రసవత్తర మ్యాచ్ ప్రారంభం కానుంది.