నాటి ‘రిజర్వ్‌ డే’ విన్నర్ ఇండియానే.. మరి ఇప్పుడు..?

వర్షం కారణంగా ప్రపంచకప్‌‌ సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడింది. కాగా నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇక ఈ రోజు 46.2ఓవర్ల నుంచి మ్యాచ్‌ తిరిగి ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్‌లో భారత్‌‌ ప్రత్యర్థిగా ఉన్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటం రెండోసారి. 1999లో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ కూడా […]

నాటి ‘రిజర్వ్‌ డే’ విన్నర్ ఇండియానే.. మరి ఇప్పుడు..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:08 PM

వర్షం కారణంగా ప్రపంచకప్‌‌ సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడింది. కాగా నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇక ఈ రోజు 46.2ఓవర్ల నుంచి మ్యాచ్‌ తిరిగి ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్‌లో భారత్‌‌ ప్రత్యర్థిగా ఉన్న మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటం రెండోసారి. 1999లో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ కూడా రిజర్వ్‌ డేకు వాయిదా పడింది.

అప్పుడు తొలి రోజు భారత ఇన్నింగ్స్ 8 వికెట్ల నష్టానికి 232 పరుగులతో ముగిసి.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక వర్షం వచ్చింది. దీంతో మరుసటి రోజుకు వాయిదా పడింది. ఇక ఆ మ్యాచ్‌లో భారత టీమ్ 63పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. నాటి ఓపెనర్ సౌరవ్ గంగూలీ 40పరుగులు, 3వికెట్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడు కూడా రిజర్వ్‌ డే భారత్‌కు కలిసివస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. కాగా వర్షం కారణంతో ఇవాళ కూడా మ్యాచ్ జరగకపోతే.. 15పాయింట్లతో పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఇండియా డైరక్ట్‌గా ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..