మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడా..?

ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్ మ్యాచ్.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ జరగనుంది. అయితే ఈ మెగా టోర్నోలో ఆ మధ్య కొన్ని మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఈ మ్యాచ్‌కు కూడా ఇబ్బంది పెట్టేలా ఉన్నాడు. సెమీస్ తొలి పోరు చూసేందుకు ప్రేక్షకులతో పాటు వరుణుడు కూడా వస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం మాంచెస్టర్ మేఘావృతమై ఉంది. ఆకాశంలో నీలి మబ్బులు కమ్మకున్నాయి. మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోందని బ్రిటన్ వాతావరణ శాఖ వెల్లడించింది. […]

మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 1:01 PM

ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్ మ్యాచ్.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ జరగనుంది. అయితే ఈ మెగా టోర్నోలో ఆ మధ్య కొన్ని మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఈ మ్యాచ్‌కు కూడా ఇబ్బంది పెట్టేలా ఉన్నాడు.

సెమీస్ తొలి పోరు చూసేందుకు ప్రేక్షకులతో పాటు వరుణుడు కూడా వస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం మాంచెస్టర్ మేఘావృతమై ఉంది. ఆకాశంలో నీలి మబ్బులు కమ్మకున్నాయి. మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోందని బ్రిటన్ వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగేటప్పుడు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సెమీస్ సవ్యంగా సాగుతుందా లేదా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒకవేళ వరుణుడు అడ్డుపడి.. మ్యాచ్ మధ్యలో ఆగితే.. రిజర్వ్ డే ఉంది. మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడతారు. ఒకవేళ రెండు రోజులు వర్షం పడి మ్యాచ్ ఫలితం తేలకుంటే భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. కోహ్లీసేన లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే ఇందుకు కారణం. 8 మ్యాచుల్లో 7 గెలిచి 15 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.