భారత్-పాక్ మ్యాచ్: అందరినీ ఆకట్టుకున్న ఈ జంట ఎవరంటే..?

, భారత్-పాక్ మ్యాచ్: అందరినీ ఆకట్టుకున్న ఈ జంట ఎవరంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో కోహ్లీ సేన మరో గెలుపును ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు దాయాది దేశాల నుంచే కాకుండా మిగిలిన దేశాల అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే వారందరిలో కెనడాకు చెందిన ఓ జంట ఇరు దేశాల అభిమానుల మనసులను గెలుచుకుంది. భారత్‌- పాక్ దేశాల జెర్సీలను కలిపి కుట్టించుకున్న డ్రెస్ వేసుకొని ఈ జంట రెండు జట్లకు మద్దతు పలికింది.

ఇక వీరి ఫొటోను లక్ష్మీ కౌల్ అనే ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ఈ జంటను ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో చూశా. ఇందులో భర్తది పాకిస్తాన్, భార్యది భారత్ అవ్వగా.. ఆ రెండు దేశాల జెర్సీలను కలపి కుట్టించుకొని ధరించారు. వారిద్దరు కెనడియన్స్. ఇంగ్లండ్‌లో ఆటను చూస్తూ.. శాంతికి చిహ్నంగా నిలిచారు’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ ఫొటోపై స్పందిస్తోన్న నెటిజన్లు.. ‘‘ఇరు దేశాల మధ్య జరుగుతున్నది కేవలం ఆటేనని వీరు అందరికి గట్టిగా చెప్పారని’’ ఒకరు కామెంట్ చేయగా.. ‘‘నిన్న ఎవరు గెలిచారనేది అనవసరం. కానీ మనమంతా ఒక్కటేనని వీరు చాటిచెబుతున్నారు’’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *