ధోనీ గ్లోవ్స్‌పై ‘బలిదాన్’ గుర్తుని తొలగించాలి: ఐసీసీ

ICC, ధోనీ గ్లోవ్స్‌పై ‘బలిదాన్’ గుర్తుని తొలగించాలి: ఐసీసీ

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2019లో వివాదాస్పదంగా మారిన ధోనీ వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌పై ఉన్న గుర్తు విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. భారత ఆర్మీ లెప్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ.. పారా మిలటరీకి బలగాలకి చెందిన ‘బలిదాన్’ గుర్తుని తన గ్లోవ్స్‌పై వేయించుకుని ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కీపింగ్ చేశాడు. దీంతో.. అతని దేశభక్తిని కీర్తిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో కొనియాడగా.. వెంటనే ఆ గుర్తుని ధోనీ గ్లోవ్స్‌ నుంచి తొలగింపజేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గురువారం రాత్రి ఐసీసీ సూచన చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తుల్ని ఆటగాళ్ల జెర్సీ, కిట్స్‌పై అనుమతించరు. చివరగా ఐసీసీ ధోనీ తన గ్లోవ్స్‌పై వేయించుకున్న‌ ‘బలిదాన్’ గుర్తుని తొలగింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *