ఐపీఎల్‌కు మార్గం సుగుమం.. టీ20 ప్రపంచకప్ వాయిదా!

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ టోర్నమెంట్లను పునః ప్రారంభించేందుకు ఐసీసీ సన్నద్ధం అవుతోంది. అయితే చోటు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ కూడా బీసీసీఐకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్- నవంబర్ విండో మధ్య జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ దాదాపుగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అఫీషియల్‌గా వెల్లడించనుంది. ఈ నెల 26 నుంచి 28 […]

ఐపీఎల్‌కు మార్గం సుగుమం.. టీ20 ప్రపంచకప్ వాయిదా!
Follow us

|

Updated on: May 22, 2020 | 9:47 PM

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ టోర్నమెంట్లను పునః ప్రారంభించేందుకు ఐసీసీ సన్నద్ధం అవుతోంది. అయితే చోటు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ కూడా బీసీసీఐకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్- నవంబర్ విండో మధ్య జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ దాదాపుగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అఫీషియల్‌గా వెల్లడించనుంది.

ఈ నెల 26 నుంచి 28 వరకు ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియాలు సమావేశాలు నిర్వహించనున్నాయి. కరోనా నేపధ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. విదేశాల నుంచి ఎవరు అక్కడికి వెళ్ళినా 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. ఇలాంటి పరిస్థితుల్లో 16 జట్లు ఆస్ట్రేలియా వెళ్ళడం అసాధ్యం. అందుకే తదుపరి విండోపై ఐసీసీ, సీఏ తీవ్ర కసరత్తులు చేస్తోంది.

క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ నిర్వహణకు 2021 ఫిబ్రవరి/ మార్చి విండో వైపు మొగ్గు చూపుతుండటంతో.. ఐపీఎల్ 13వ సీజన్‌ అక్టోబర్- నవంబర్ విండోలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికి వీసాలపై ఆంక్షలు కూడా ఎత్తేసే ఛాన్స్ ఉండటంతో.. బీసీసీఐ ఆ విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.