వరల్డ్ కప్ 2019 “థీమ్ సాంగ్” రిలీజ్.. వీడియో

ప్రపంచ కప్ 2019 కి సబంధించింన అధికారిక గీతాన్ని ఇవాళ ఐసీసీ విడుదల చేసింది. స్టాండ్ బై అన్న టైటిల్‌తో ఈ పాటను రిలీజ్ చేశారు. కొత్త ఆర్టిస్ట్ లోరిన్‌తో పాటు మ‌రో ఆర్టిస్ట్ బ్యాండ్‌ రుడిమెంటల్ ఈ థీమ్ సాంగ్‌ను పాడారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఈ నెల 30వ తేదీన ప్రారంభంకానున్న‌ది. ఈ మెగా ఈవెంట్‌ను గుర్తు చేస్తూ ఈ పాప్‌ సాంగ్‌ను తయారు చేశారు. ప్రతి అభిమాని ఈ టోర్నీలో పాల్గొనే తమ జట్ల పట్ల అభిమానాన్ని తెలిపేలా ఈ పాట సాగుతుంది. 48 మ్యాచ్‌ల పాటు సాగనున్న ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు. స్టాండ్ బై థీమ్ సాంగ్ ప్ర‌తి క్రికెట్ ప్రేమికుడిని ఆక‌ట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *