Breaking News
  • హథ్రాస్‌ రేప్‌ కేసులో ట్విస్ట్‌: యూపీ: హథ్రాస్‌ ఘటనపై ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ సంచలనం. యువతిపై అత్యాచారం జరగలేదంటున్న యూపీ పోలీసులు. అత్యాచారం జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు లభ్యంకాలేదు-ఏడీజీ. సున్నితభాగాలపై ఎలాంటి గాయాలు లేవని ఎఫ్‌సీఎల్‌ రిపోర్ట్‌. అత్యాచార బాధితురాలి శరీరంపై స్పెర్మ్‌ మరకలు లేవన్న ఎఫ్‌సీఎల్‌ రిపోర్ట్‌. నాలుక కోశారనడం కూడా అవాస్తవమే-యూపీ ఏడీజీ ప్రశాంత్‌కుమార్‌. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు గ్యాంగ్‌రేప్‌గా చిత్రీకరించారని పోలీసుల అనుమానాలు. మెడకు తీవ్రగాయం కావటంతోనే బాధితురాలు మృతిచెందినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.
  • తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం. నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ. అక్టోబర్ 16 నుండి 24 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు. వాహనసేవలను యథావిధిగా మాడవీధుల్లో ఊరేగించాలని నిర్ణయించిన టీటీడీ. బ్రహ్మోత్సవ రోజుల్లో దర్శనాల సంఖ్యను కూడా పెంచే యోచనలో టీటీడీ. దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించాలని నిర్ణయం. దర్శనాల సంఖ్యను 20వేల వరకు పెంచే అవకాశం. మాడవీధుల్లోని గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్ తో పాటు ఫుట్ ఆపరేటడ్ శానిటైజర్లు ఏర్పాటు.
  • తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసును వారంలోగా తేల్చండి. హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం . మూడు వారాల తర్వాత విచారణ చేయనున్న సుప్రీంకోర్టు. తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడిన ఈ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం. సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని క్వాష్ పిటిషన్ వేసిన సుధీర్ బాబు. దర్యాప్తును ఆపేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వారంలోగా ఈ కేసును పూర్తిచేయాలని హైకోర్టు ను ఆ దేశించిన సుప్రీం . హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.
  • విజయవాడ: సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రేపటికి ఏడాది పూర్తి. గత ఏడాది గాంధీ జయంతి రోజు ప్రారంభించాం. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం-పెద్దిరెడ్డి. ప్రతి యాబై కుటుంబాలకు గ్రామ, వార్డు వాలంటీర్‌ను అందుబాటులో ఉంచాం. అవినీతికి తావు లేకుండా సేవలందిస్తున్నాం. ప్రధానమంత్రి సైతం సచివాలయ పనితీరును అభినందించారు.
  • ఏపీలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 25 మంది మహిళా అధ్యక్షురాలను ప్రకటించిన టీడీపీ . 25 మంది మహిళా ప్రధాన కార్యదర్శిలను ప్రకటించిన టీడీపీ . 50 పార్టీ పదవుల్లో 21 మంది బీసీ మహిళలు, 8 మంది ఎస్సీ మహిళలు.. ఇద్దరు ఎస్టీలు, 19 మంది ఓసీల ప్రకటన . మహిళా కమిటీలను ప్రకటించిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత.
  • అమరావతి: కోనసీమ ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్‌ 14ఏళ్ల కల. బినామీ సంస్థలతో కోన ప్రాంతాన్ని కైంకర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టికొట్టం హేయమైన చర్య. కాకినాడ సెజ్‌ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లలో సగం స్థానిక రైతులకే ఇవ్వాలి. జగన్‌ బినామీ అవినీతి లావాదేవీలపై దర్యాప్తు చేపట్టాలి. పార్లమెంటు ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలి. కాకినాడ సెజ్‌లో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ పెడితే.. కోనసీమ ప్రాంతం కాలుష్య ప్రాంతమే-మాజీ మంత్రి యనమల .
  • విశాఖ: యూపీ అత్యాచార ఘటనకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర దళిత, మహిళా సంఘాల ఆందోళన.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-2లో కోహ్లీ, రోహిత్ శర్మ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం వన్డే ర్యాంకింగ్స్‌ని ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ టాప్ క్రికెటర్ల ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు

icc odi rankings kohli rohit stays on top bairstow moves into top ten, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-2లో కోహ్లీ, రోహిత్ శర్మ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం వన్డే ర్యాంకింగ్స్‌ని ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ టాప్ క్రికెటర్ల ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్నాడు. కోహ్లీ 871 పాయింట్లతో తిరుగులేని స్థితిలో ఉండగా..టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (855), బాబర్‌ అజామ్‌(829) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన ఓపెనర్‌ బెయిర్‌ స్టో టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌తో ఆఖరిదైన మూడో వన్డేలో బెయిర్‌స్టో అద్భుతమైన సెంచరీతో రాణించి రేటింగ్‌ పాయింట్లు అమాంతం పెంచుకున్నాడు. 30 ఏండ్ల యార్క్‌షైర్‌ ఆటగాడు 2018 అక్టోబర్‌లో తొలిసారి తొమ్మిదో ర్యాంకు సాధించాడు.

వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే.. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ నంబర్‌వన్‌ స్థానంలో నిలువగా, టీమిండియా స్పీడ్‌స్టర్‌ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కాగా, అఫ్గనిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ 301 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Related Tags