ధోనీ గ్లౌవ్స్‌పై ‘బలిదాన్’ చిహ్నం తొలగించండి: ఐసీసీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ గడ్డపై జాతీయ జెండాకి అవమానం జరగకుండా కాపాడిన ధోనీ.. తాజాగా ఇంగ్లాండ్ గడ్డపై ప్రపంచకప్‌ వేదికగా ‘బలిదాన్’ గుర్తుతో మన పారా మిలటరీ దళాలకి సముచిత గౌరవం ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో తన వికెట్ కీపింగ్ గ్లౌవ్స్‌పై భారత పారా మిలటరీ దళ చిహ్నం ‘బలిదాన్’ గుర్తుని ప్రత్యేకంగా వేయించిన ధోనీ.. అందరి చూపు […]

ధోనీ గ్లౌవ్స్‌పై ‘బలిదాన్’ చిహ్నం తొలగించండి: ఐసీసీ
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 9:19 PM

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ గడ్డపై జాతీయ జెండాకి అవమానం జరగకుండా కాపాడిన ధోనీ.. తాజాగా ఇంగ్లాండ్ గడ్డపై ప్రపంచకప్‌ వేదికగా ‘బలిదాన్’ గుర్తుతో మన పారా మిలటరీ దళాలకి సముచిత గౌరవం ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో తన వికెట్ కీపింగ్ గ్లౌవ్స్‌పై భారత పారా మిలటరీ దళ చిహ్నం ‘బలిదాన్’ గుర్తుని ప్రత్యేకంగా వేయించిన ధోనీ.. అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు.

భారత్‌కి 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని అందించిన ధోనీకి.. భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాతో గౌరవించింది. ఆ తర్వాత ఆగ్రాలో పారా మిలటరీతో కలిసి శిక్షణ కూడా తీసుకున్న ధోనీ అక్కడ ఏకంగా ఐదుసార్లు పారాచ్యూట్ జంప్‌ కూడా చేశాడు. ఆర్మీ అంటే తనకెంతో ఇష్టమని గతంలోనే చెప్పిన ధోనీ.. క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత మిలటరీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకి కల్నల్ హోదాలో మిలటరీ క్యాప్‌లను ధోనీ అందజేసిన విషయం తెలిసిందే.

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహీంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ గ్లౌవ్స్‌పై భారత పారా మిలటరీ దళ చిహ్నం ‘బలిదాన్’ గుర్తుని తొలగించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ను కోరింది.