ధర్మసేన తప్పేం లేదు… వెనకేసుకొచ్చిన ఐసీసీ!

ప్రపంచకప్ ఫైనల్ ఓవర్ త్రోకు అంపైర్లు ఐదు పరుగుల బదులు ఆరు పరుగులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాట్స్ మెన్ క్రీజులోకి రాకముందే గప్తిల్ త్రో విసిరినా అంపైర్లు ఆరు పరుగులు నిర్ణయించడంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. దీనితో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. అది కూడా టై కావడంతో ఇంగ్లాండ్‌ను బౌండరీ కౌంట్ ఆధారంగా విశ్వవిజేతగా ప్రకటించారు. ఇక ఈ ఓవర్ త్రోపై అంపైర్ ధర్మసేన కూడా స్పందించిన సంగతి […]

ధర్మసేన తప్పేం లేదు... వెనకేసుకొచ్చిన ఐసీసీ!
Follow us

|

Updated on: Jul 28, 2019 | 5:16 PM

ప్రపంచకప్ ఫైనల్ ఓవర్ త్రోకు అంపైర్లు ఐదు పరుగుల బదులు ఆరు పరుగులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాట్స్ మెన్ క్రీజులోకి రాకముందే గప్తిల్ త్రో విసిరినా అంపైర్లు ఆరు పరుగులు నిర్ణయించడంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. దీనితో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. అది కూడా టై కావడంతో ఇంగ్లాండ్‌ను బౌండరీ కౌంట్ ఆధారంగా విశ్వవిజేతగా ప్రకటించారు. ఇక ఈ ఓవర్ త్రోపై అంపైర్ ధర్మసేన కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనిపై ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ మాట్లాడుతూ ‘ఓవర్ త్రోపై పరుగులను నిర్ణయించడానికి ఆన్ ఫీల్డ్ అంపైర్లు సరైన ప్రక్రియనే ఎంచుకున్నారని’ అన్నాడు.

ధర్మసేనను వెనకేసుకొస్తూ.. ‘బ్యాట్స్‌మెన్ త్రో విసిరే సమయానికి క్రీజు దాటారనుకుని భావించి అంపైర్లు ఇద్దరూ చర్చించే ఆరు పరుగులుగా నిర్ణయం’ తీసుకున్నారు. అటు ఫీల్డ్ అంపైర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించాక.. మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకోలేరని’ జియోఫ్ తెలిపారు.