వరల్డ్ కప్ 2019: శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం

వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 203 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ లక్ష్యాన్ని సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ అలవోకగా ఛేదించారు.  ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్(15) తక్కువ పరుగులకే ఔటైనా, హషీం ఆమ్లా (80), కెప్టెన్ డూప్లెసిస్ (96) మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో మలింగకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు బ్యాటింగ్‌కు […]

వరల్డ్ కప్ 2019: శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం
Follow us

|

Updated on: Jun 28, 2019 | 11:44 PM

వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 203 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ లక్ష్యాన్ని సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ అలవోకగా ఛేదించారు.  ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్(15) తక్కువ పరుగులకే ఔటైనా, హషీం ఆమ్లా (80), కెప్టెన్ డూప్లెసిస్ (96) మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో మలింగకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక సఫారీ బౌలర్లను ఎదుర్కొనడానికి చాలా తంటాలు పడింది. ఆ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ 30 పరుగులకు మించి చేయలేదంటే ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. సఫారీ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రబాడా 2, క్రిస్ మోరిస్ 3, ప్రిటోరియస్ 3 వికెట్లు, జెపి డుమిని, ఫెలుక్వాయో చెరో వికెట్ తీశారు. ప్రిటోరియస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!