సఫారీలపై భారత్ సవారీ

ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోహ్లీసేన బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహల్‌ (4/51), బుమ్రా (2/35), భువనేశ్వర్‌ (2/44) ధాటికి నిర్ణేత 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులే చేయగలిగింది. మోరిస్‌ (42; 34 బంతుల్లో 1×4, 2×6), రబాడ (31 నాటౌట్‌; 35 బంతుల్లో 2×4)లు మెరవడంతో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. రోహిత్‌ శర్మ (122 నాటౌట్‌; 144 బంతుల్లో 13×4, 2×6) అజేయ శతకానికి ధోని (34; 46 బంతుల్లో 2×4), రాహుల్‌ (26; 42 బంతుల్లో 2×4)ల బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ తోడవడంతో  లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *