టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న విండీస్‌

ICC World Cup 2019, టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న విండీస్‌

సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌ సమరంలో భాగంగా మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో  మొదలు కానుంది. సౌథాంప్టన్‌ వేదికగా వెస్టిండీస్‌- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాలతో మెగాటోర్నీలో అడుగు పెట్టిన సఫారీ జట్టు ఇంత వరకు బోణీ కొట్టలేదు. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి తొలి విజయం నమోదు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు కంగారూల చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన విండీస్‌ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *