Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

ఏంటి కోహ్లి ఇది? ఇలా చేస్తే ఎలా మరి

, ఏంటి కోహ్లి ఇది? ఇలా చేస్తే ఎలా మరి

వరల్డ్ కప్ 2019లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో 140 రన్స్‌తో రోహిత్ శర్మ భారత్ విజయంలో కిలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ కూడా అర్థ శతకాలతో సత్తా చాటారు. ముఖ్యంగా కోహ్లి 77 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 5 ఓవర్లలో వర్షం ఆగిపోయిన తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చిన కాసేపటికే కొహ్లీ ఔట్ అయ్యాడు. అమీర్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐతే పాక్ క్రికెటర్ల అప్పీల్‌కు అంపైర్ స్పందించలేదు. దాన్ని ఔట్‌గా ప్రకటించలేదు. కానీ కొహ్లీ మాత్రం క్రీజును వదిలి వెళ్లిపోయాడు. ఐతే రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. బంతి బ్యాట్‌ను తాకలేదని స్పష్టంగా కనిపించింది.

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన తర్వాత రిప్లే చూసి కోహ్లి షాకయ్యాడు.  ఔట్ కాకుండానే అనవసరంగా వెనుదిరిగానన్న పశ్చాతాపం అతడిలో కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాట్ హ్యాండిల్‌ను కోపంతో పదే పదే ఊపుతూ కనిపించాడు కొహ్లీ. ధోనీ సైతం అతడి బ్యాట్‌ను చూసి పరిశీలించాడు. ఐతే హ్యాండిల్ విరగడం వల్లే బంతిని తాకినట్లుగా సౌండ్ వచ్చిందని తెలిసింది. అందుకే అంపైర్ ప్రకటించకున్నా కొహ్లీ తనకు తానుగా వెనుదిరిగాడు.

కొహ్లీ చేసిన పనిని భారత క్రీడాభిమానులు తప్పుపడుతున్నారు. అసలే హై టెన్షన్ మ్యాచ్ కాబట్టి కాస్త సంయమనం పాటించి ఉండాల్సిందని అభిప్రాయపడుతోన్నారు.  చివరి రెండు ఓవర్లు కొహ్లీ క్రీజులో ఉంటే స్కోరు మరింత పెరిగేదని..భారత్ 350 పరగులు చేసి ఉండేదని సోషల్ మీడియాలో నెటిజన్లు తమ ఒపినియన్లు షేర్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌తో తక్కువ ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు చేసిన ఆటగాడిగా కొహ్లీ రికార్డు సాధించాడు.

Related Tags