ప్రభుత్వ బ్యాంకుల్లో వెల్లువెత్తనున్న ఉద్యోగాలు..

ప్రభుత్వ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇదే సరైన అవకాశం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీఎస్( ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1389 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 612, ఏపీలో 777 పోస్టులు. కాగా, అక్టోబర్ 9న దరఖాస్తు గడువు ముగియనుంది. అలాహాబాద్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, ఇండియన్ ఓర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, […]

ప్రభుత్వ బ్యాంకుల్లో వెల్లువెత్తనున్న ఉద్యోగాలు..
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 3:55 PM

ప్రభుత్వ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇదే సరైన అవకాశం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీఎస్( ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1389 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 612, ఏపీలో 777 పోస్టులు. కాగా, అక్టోబర్ 9న దరఖాస్తు గడువు ముగియనుంది.

అలాహాబాద్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, ఇండియన్ ఓర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పోస్టుల్ని నియమించనుంది.

వివరాలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 17 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్‌కు కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 2019 నవంబర్ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్‌: 2019 నవంబర్, డిసెంబర్ ఐబీపీఎస్ ప్రిలిమ్స్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 2019 నవంబర్ ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్: 2019 డిసెంబర్ 07, 08, 14, 15 ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్: 2019 డిసెంబర్ / 2020 జనవరి మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2020 జనవరి ఐబీపీఎస్ మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్: 2020 జనవరి 19 ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2020 ఏప్రిల్

విద్యార్హత: ఏదైనా డిగ్రీ చదివి.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఇందుకు అర్హులు. ఇక, ibps.in వెబ్ సైట్‌ను ఓపెన్ చేస్తే.. క్లర్క్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. అందులో అర్హులైనవారు.. తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చు.