#Covid-19 ఐసోలేషన్‌లో ఐఏఎస్ అధికారి.. కరోనా?

ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. తనకు తానే ఐసోలేషన్‌ వార్డులో వుండిపోయారు. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొంపదీసి ఆయనకు కరోనానా ? ఈ చర్చ ఇపుడు తెలంగాణలో సంచలనం రేపుతోంది.

#Covid-19 ఐసోలేషన్‌లో ఐఏఎస్ అధికారి.. కరోనా?
Follow us

|

Updated on: Mar 16, 2020 | 5:01 PM

Senior IAS officer in isolation ward: ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. తనకు తానే ఐసోలేషన్‌ వార్డులో వుండిపోయారు. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొంపదీసి ఆయనకు కరోనానా ? ఈ చర్చ ఇపుడు తెలంగాణలో సంచలనం రేపుతోంది.

అరవింద్ కుమార్… తెలంగాణలో ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. సడన్‌గా కరోనా పరీక్షలకు వచ్చారు. చేయించుకున్నారు. కోవిడ్ 19 వైద్య పరీక్షలు చేయించుకున్నానని ఆయన స్వయంగా వెల్లడించారు. అంతే కాదు.. తనకు తానుగా ఐసోలేషన్లో వున్నానని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నానని ఆయనే అంటున్నారు. మరి ఆయనకు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? కరోనా వైరస్ సోకిందా? ఈ ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది.

అయితే.. ఆయనే వివరాలు వెల్లడించారు. ‘‘ నాకు ఎలాంటి దగ్గు జలుబు జ్వరం లేవు.. నాకు నేనే స్వయంగా ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ 19తో పాటు అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాను.. ఎందుకంటే ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాను. అందుకే ప్రభుత్వ నిబంధనలు అన్ని పాటిస్తూ వైద్య పరీక్షలు చేయించుకున్నాను… ఇంటి వద్ద హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాను..’’ ఇదీ ఆయన ఇచ్చిన క్లారిటీ. విదేశాలకు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో కనీసం 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో వుండేందుకు ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయం అన్నమాట. అందులో భాగంగానే ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారన్నమాట.