‘ నన్ను అభిశంసిస్తారా ? బస్తీ మే సవాల్ ‘ అంటున్న ట్రంప్

‘ నన్ను అభిశంసిస్తారా ? అయితే ఫైట్ కి నేను రెడీ ‘ అని సవాల్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనను అభిశంసిస్తూ దిగువ సభలో ఓటింగ్ జరిగిన రోజున ఆయన వాషింగ్టన్ కు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న మిచిగాన్ లోని బ్యాటిల్ క్రీక్ అనే చిన్న టౌన్ లో ఉన్నారు. అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని.. తన అభిశంసన ప్రక్రియపై జోక్స్ వేశారు. ఈ ర్యాలీలో ఈయనకు డై […]

' నన్ను అభిశంసిస్తారా ? బస్తీ మే సవాల్ ' అంటున్న ట్రంప్
Follow us

| Edited By:

Updated on: Dec 19, 2019 | 12:06 PM

‘ నన్ను అభిశంసిస్తారా ? అయితే ఫైట్ కి నేను రెడీ ‘ అని సవాల్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనను అభిశంసిస్తూ దిగువ సభలో ఓటింగ్ జరిగిన రోజున ఆయన వాషింగ్టన్ కు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న మిచిగాన్ లోని బ్యాటిల్ క్రీక్ అనే చిన్న టౌన్ లో ఉన్నారు. అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని.. తన అభిశంసన ప్రక్రియపై జోక్స్ వేశారు. ఈ ర్యాలీలో ఈయనకు డై హార్డ్ మద్దతుదారులైన సుమారు 7 వేలమంది.. ‘ వీ వాంట్ ట్రంప్.. వీ వాంట్ ట్రంప్ ‘ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్థులైన డెమొక్రాట్లను, మీడియాలో ఒక వర్గాన్ని తప్పు పట్టిన ట్రంప్.. తాను ఎలాంటి పోరాటానికైనా సిధ్ధమని ప్రకటించారు. ఈ డెమొక్రాట్లు అమెరికన్ ప్రజల పట్ల అత్యంత ద్వేషాన్ని చూపుతున్నారని, అందులో భాగంగానే తనను ఇంపీచ్ చేయడానికి పూనుకొన్నారని ఆయన ఆరోపించారు. ‘ వాళ్ళు తొలిరోజు నుంచే ఇందుకు ప్రయత్నిస్తున్నారు. నేనెక్కడికి పారిపోతానేమోనని అంతకుముందే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు ‘ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా దిగుతున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ అవినీతిపై విచారణ జరిపించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిని కోరారని, పైగా దీనిపై కాంగ్రెస్ విచారణకు అడ్డుపడేందుకు యత్నించారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ అభియోగాలపై దిగువ సభలో సుమారు 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చివరకు ఆయన అభిశంసనకు అనుకూలంగా ఓటింగ్ జరిగింది.

అయితే ట్రంప్ దీన్ని ఓ ప్రహసనంలా తేలిగ్గా కొట్టి పారేశారు. ఆయన వేసిన జోక్స్ కి ప్రజలు, ఆయన మద్దతుదారులు పడీపడీ నవ్వారు. ‘ మీరు ‘ బూ ‘ అని కేకలు పెట్టాలని ఆయన కోరగానే వారంతా అలాగే కేకలు పెట్టారు. మీరు మరో నాలుగేళ్లు అధికారంలో ఉండాలంటూ నినాదాలు చేశారు. కాగా… జనవరిలో రిపబ్లికన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న సెనేట్ లో జరిగే ఓటింగ్ సందర్భంగా ట్రంప్ అభిశంసన తీర్మానం వీగిపోవచ్ఛునని భావిస్తున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!