‘హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నా.. బాగానే ఉన్నా’.. బ్రెజిల్ నేత జైర్ బొల్సొనారో

కరోనా పాజిటివ్ బారిన పడిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో తన ఆరోగ్యం మెరుగు పడినట్టు కనిపిస్తోందన్నారు. యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ని తను తీసుకుంటున్నానని, ఇప్పుడు తన హెల్త్ పరిస్థితి మెరుగ్గా..

'హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నా.. బాగానే ఉన్నా'.. బ్రెజిల్ నేత జైర్ బొల్సొనారో
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2020 | 5:03 PM

కరోనా పాజిటివ్ బారిన పడిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో తన ఆరోగ్యం మెరుగు పడినట్టు కనిపిస్తోందన్నారు. యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ని తను తీసుకుంటున్నానని, ఇప్పుడు తన హెల్త్ పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. ఈ మెడిసిన్ ని తీసుకుంటున్న ఫుటేజీని ఆయన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ మందును గతంలో ప్రశంసించారు. తను రోజూ దీన్ని తీసుకుంటున్నట్టు ఆ మధ్య పేర్కొన్నారు. ఇప్పుడు జైర్ కూడా అదే తీరున  మాట్లాడుతున్నారు. ఇది తీసుకున్నాక బెటర్ గా ఫీలవుతున్నా.. ఈ మందు బాగా పని చేస్తోంది అని చెప్పిన ఆయన.. శాస్త్రీయంగా ఇది ఉత్తమమైనదా కాదా అన్నది మనలో ఎవరికీ తెలియదని, కానీ ఈ మందును మాత్రం తాను పూర్తిగా నమ్మానని చెప్పారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ ఖఛ్చితంగా కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడుతుందా అన్న దానిపై మళ్ళీ సందేహాలు వ్యక్తమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని క్లినికల్ ట్రయల్స్ కి తిరిగి వైద్య నిపుణులు శ్రీకారం చుడుతున్నారు. కాగా-బ్రెజిల్ లో 1.6 మిలియన్ల మంది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. అరవై ఆరు వేల మందికి పైగా రోగులు మృతి చెందారు.