అభినందన్‌కి ‘వీర్‌చక్ర’ పురస్కారం కన్‌ఫామ్..!

IAF Wing Commander Abhinandan Varthaman to be Conferred With Vir Chakra on Independence day, అభినందన్‌కి ‘వీర్‌చక్ర’ పురస్కారం కన్‌ఫామ్..!

భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం లభించింది. ‘వీర్‌చక్ర’ పురస్కారం కన్‌ఫామ్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15 సందర్భంగా అభినందన్‌కు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్కాడ్రాన్ లీడర్ మింటీ అగర్వాల్‌ను కూడా యుద్ధ సేవ అవార్డుతో సత్కరించనున్నారు. బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో.. పాక్ ఎఫ్ -16 విమానాన్ని అభినందన్ తన మిగ్ -21 బైసన్ యుద్ధ విమానంతో కూల్చేశారు. అనంతరం అనుకోకుండా పాకిస్థాన్‌కు చిక్కాడు. మార్చి 1న అతన్ని పాక్ రిలీజ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *