ఎఫ్‌16ని కూల్చేశాం.. సాక్ష్యాలు ఇవిగో..

న్యూఢిల్లీ : పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసిన దానికి సాక్ష్యాలను ఇవాళ భారత వైమానిక దళం విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని మిగ్‌ 21తోనే కూల్చేశామని మరోసారి స్పష్టం చేసింది. గతంలోనే ఎఫ్-16 నుంచి బయటపడ్డ ఆమ్రమ్ మిస్సైల్ శిథిలాలను భారత వైమానిక దళం మీడియాకు చూపించింది. అయితే ఆ ఘటనకు సంబంధించిన రాడార్‌ ఆధారాలను ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ఇవాళ బయటపెట్టారు. కానీ వాటిని ప్రజాక్షేత్రంలోకి విడుదల […]

ఎఫ్‌16ని కూల్చేశాం.. సాక్ష్యాలు ఇవిగో..
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 08, 2019 | 7:46 PM

న్యూఢిల్లీ : పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసిన దానికి సాక్ష్యాలను ఇవాళ భారత వైమానిక దళం విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని మిగ్‌ 21తోనే కూల్చేశామని మరోసారి స్పష్టం చేసింది. గతంలోనే ఎఫ్-16 నుంచి బయటపడ్డ ఆమ్రమ్ మిస్సైల్ శిథిలాలను భారత వైమానిక దళం మీడియాకు చూపించింది. అయితే ఆ ఘటనకు సంబంధించిన రాడార్‌ ఆధారాలను ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ఇవాళ బయటపెట్టారు. కానీ వాటిని ప్రజాక్షేత్రంలోకి విడుదల చేయబోమన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన డాగ్‌ఫైట్‌లో.. ఎఫ్‌16 విమానాన్ని కూల్చామని, దానికి కావాల్సిన ఆధారాలు అన్నీ పక్కాగా ఉన్నాయని వైమానికదళ అధికారి వైస్‌ మార్షల్‌ ఆర్‌జీకే కపూర్‌ వెల్లడించారు.

పాకిస్థాన్‌ దగ్గర ఉన్న ఎఫ్‌16 యుద్ధ విమానాల సంఖ్య తగ్గలేదని రెండు రోజుల క్రితం అమెరికా ఫారిన్‌ పాలసీ పత్రిక ఓ రిపోర్ట్‌ను వెల్లడించింది. దీంతో ఎఫ్‌16 కూల్చివేతపై అస్పష్టత నెలకొన్నది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన డాగ్‌ఫైట్‌ తర్వాత.. భారత అధికారులు ఆమ్రమ్‌ మిస్సైల్‌ శిథిలాన్ని గుర్తించారు. ఆ రోజు జరిగిన ఫైట్‌లో రెండు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు నేలకూలాయని ఐఏఎఫ్‌ అధికారి తెలిపారు. దాంట్లో ఐఏఎఫ్‌కు చెందిన బైసన్‌ మిగ్‌ విమానంతో పాటు ఎఫ్‌16 ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే పాక్‌ వాడిన ఎఫ్‌16 విమానానికి చెందిన ఎలక్ట్రానిక్‌ సిగ్నేచర్‌తో పాటు రేడియో ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!