నేను వీరిలా ఆడలేనేమో-రాహుల్ ద్రావిడ్

నా బ్యాటింగ్ ఇప్పుడు పనికి రాదు అంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. అంతే కాదు… తాను బ్యాటింగ్‌తో ఎక్కువకాలం నెట్టుకురాలేకపోయేవాడినేమో … అంటూ తనను తానే ప్రశ్నించుకున్నారు. ఇప్పుడు ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ చూడండి.. ఇప్పటి ఆటగాళ్ల వేగం చాలా ఎక్కువ అంటూ పొగిడేశారు. అప్పట్లో సచిన్, సెహ్వాగ్‌ల స్ట్రైక్ రేట్ కంటే తనది తక్కువగా ఉండేదన్నారు. కానీ అప్పట్లో అదే చాలా గ్రేట్… కానీ ఇప్పుడలా కాదు… […]

నేను వీరిలా ఆడలేనేమో-రాహుల్ ద్రావిడ్
Follow us

|

Updated on: Jun 09, 2020 | 10:50 PM

నా బ్యాటింగ్ ఇప్పుడు పనికి రాదు అంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. అంతే కాదు… తాను బ్యాటింగ్‌తో ఎక్కువకాలం నెట్టుకురాలేకపోయేవాడినేమో … అంటూ తనను తానే ప్రశ్నించుకున్నారు. ఇప్పుడు ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ చూడండి.. ఇప్పటి ఆటగాళ్ల వేగం చాలా ఎక్కువ అంటూ పొగిడేశారు. అప్పట్లో సచిన్, సెహ్వాగ్‌ల స్ట్రైక్ రేట్ కంటే తనది తక్కువగా ఉండేదన్నారు. కానీ అప్పట్లో అదే చాలా గ్రేట్… కానీ ఇప్పుడలా కాదు… భారీగా ఆడగలగాలి… అన్ని రకాల గేర్లలో బ్యాటింగ్ చేయగలగాలన్నారు. తను అలా చేయలేనని ఒప్పుకున్నారు.

అయితే.. రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో మొత్తంగా 24వేల పరుగులు చేశారు. అందులో 48 సెంచరీలు, 146 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ద్రావిడ్ స్ట్రైక్ రేట్ 42.51గా ఉండగా వన్‌డేల్లో మాత్రం 71.23తో ఉన్నారు. ద్రావిడ్ ఆటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఈ మధ్య ఓ టాలీవుడ్ అందాల భామ తనకు నచ్చిన ఆటగాడు ద్రావిడ్ అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.